మోడల్‌ పాఠశాలల్లో వేగంగా గదుల నిర్మాణం

ABN , First Publish Date - 2023-01-07T01:19:06+05:30 IST

‘మన ఊరు.. మన బడి’ పథకం కింద ఎంపికైన మోడల్‌ పాఠశాలల్లో గదుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని డీఈవో అశోక్‌ అన్నారు.

మోడల్‌ పాఠశాలల్లో  వేగంగా గదుల నిర్మాణం
నారాయణపురంలో పాఠశాల పనులను పరిశీలిస్తున్న డీఈవో అశోక్‌

చిలుకూరు, జనవరి 6: ‘మన ఊరు.. మన బడి’ పథకం కింద జిలాల్లలో ఎంపికైన మోడల్‌ పాఠశాలల్లో గదుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని డీఈవో అశోక్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని నారాయణపురం, రామాపురం ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండ లంలో రెండిటిని మోడల్‌ పాఠశాలలుగా ఎంపిక చేశామని, ఆ పాఠ శాలల్లో గదులను నిర్మిస్తున్నామన్నారు. సంబంధిత పనులను ఎప్ప టికప్పుడు పరిశీలించి సకాలంలో పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఆయన వెంట ఎంఈవో సలీంషరీఫ్‌, పాఠశాల హెచ్‌ఎంలు యల గొండ శ్రీనివాస్‌, వసంత పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T01:19:08+05:30 IST