గౌడ కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , First Publish Date - 2023-01-30T01:01:26+05:30 IST
గౌడ కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చిత్తలూరి నారాయణ, ఉపాధ్యక్షుడు బిక్కి బుచ్చయ్యగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు.
నూతన్‌కల్, జనవరి 29: గౌడ కులస్థులను ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు చిత్తలూరి నారాయణ, ఉపాధ్యక్షుడు బిక్కి బుచ్చయ్యగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. నమ్ముకున్న వృత్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టి తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్న గౌడ కులస్థులకు ‘గౌడ బంధు’ను ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పులుసు లింగమల్ల య్య, తొట్ల ప్రభాకర్‌గౌడ్, గుండగాని రాములు, బత్తుల సాయిలు, తండు సత్యనారాయణ, తొన్కునూరి అశోక్, ఆకుల ఉప్పలయ్య, లింగాల సతీష్, రేసు రాములు, రామ్మూర్తి, యాదగిరి పాల్గొన్నారు.
గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శుల నియామకం
సూర్యాపేట కల్చరల్, ఆత్మకూరు(ఎస్): గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శులుగా జిల్లా కేంద్రానికి చెందిన గుండగాని జయప్రకాష్‌గౌడ్‌ను, ఆత్మకూరు(ఎస్) మండలం నశీంపేట గ్రామానికి చెందిన దంతూరి సోమన్నను నియమించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జయప్రకాష్‌గౌడ్, సోమన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు నియామకపత్రాన్ని వారికి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తలూరి నారాయణగౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వ హించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడతూ గీత కార్శికులకు ప్రతి నెలా రూ.5వేలు ఇవ్వాలని, ప్రతి గ్రామానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలన్నారు. చట్టసభల్లో 40 శాతం రిజర్వేషన్ కల్పించాలని, గీత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. తమ నియామకానికి సహకరించిన చౌగాని శ్రీనివాస్‌గౌడ్, చిత్తలూరి విజయ్ కుమార్‌గౌడ్, వెంకటేశ్వరగౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో జలగం మల్లేష్‌గౌడ్, భిక్షంగౌడ్, ప్రవీణ్‌గౌడ్, లింగయ్య, జానయ్య. వెంకటనర్సు, శ్రీను, వెంకన్న గుండగాని రాములుగౌడ్, ఆకుల ఉప్పలయ్యగౌడ్, కప్పల రాంమూర్తిగౌడ్, పాలకుర్తి శ్రీకాంత్‌గౌడ్, పొన్నం యాదగిరిగౌడ్ తదిత రులు పాల్గొన్నారు.
లు