రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2023-04-13T00:37:11+05:30 IST

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మర గ్రామంలో, మునగాల సహకార సంఘం ఆధ్వర్యంలో మునగాల మండలం బరాఖతగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, ఏప్రిల్‌ 12: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. బుధవారం కోదాడ పరిధిలోని తమ్మర గ్రామంలో, మునగాల సహకార సంఘం ఆధ్వర్యంలో మునగాల మండలం బరాఖతగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండిం చిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకే సీఎం కేసీఆర్‌ కొనుగోలు చేయిస్తూ రైతు బాంధువుడిగా పేరు గడించారన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమా ణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీయస్‌ చైర్మన ఆవుల రామా రావు, వైస్‌ చైర్మన బి.నరేష్‌, కౌన్సిలర్‌ సామినేని నరేష్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కమతం వెంకటయ్య, ఓరుగంటి శ్రీనివాస్‌ రెడ్డి, గుండపునేని ప్రభాకర్‌రావు, చంద్రమౌళి, దేవాలయ చైర్మన కనగాల శ్రీధర్‌, సామినేని వెంకటేశ్వరరావు, బొల్లు ప్రసాద్‌, కమతం రాజేశ్వరరావు, కృష్ణయ్య, పోచం పూర్ణయ్య, హరిబాబు, ఏఈవో చాంద్‌బీ, సీఈవో మంద వెంకటేశ్వర్లు సుంకర అజయ్‌ కుమార్‌, వీరంరెడ్డి లింగారెడ్డి, సర్పంచలు కొప్పుల వీరమ్మ, చింతకాయల ఉపేందర్‌, తొగరు రమేష్‌ పాల్గొన్నారు. ఆకు పాముల గ్రామంలో లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పంపిణీ చేసి సామూహిక గృహ ప్రారంభోత్స వాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- కాపుగల్లులో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధ్యక్షుడు నంబూరి సూర్యం ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు నల్లూరి రమేష్‌, గుండెబోయిన వీరబాబు, ముత్తవరపు వీరయ్య, బాలెబోయిన వెంకటేశ్వర్లు, మార్తి లక్ష్మీనర్సయ్య, జిల్లా వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

- కోదాడ మండలం తమ్మర గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

Updated Date - 2023-04-13T00:37:11+05:30 IST