మార్కెట్‌లో వ్యాపారుల దగా
ABN , First Publish Date - 2023-04-19T00:08:11+05:30 IST
సూర్యాపేట వ్యవసా య మార్కెట్‌లో రైతులు వ్యాపారుల చేతుల్లో నిలువు దోపిడీకి గురవుతున్నారు.చేసేది లేక ఆరుగాలం కష్టించి పండించిన పంటను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మార్కెట్‌కు దొడ్డురకాలైన ఐఆర్-64, 1010 ధాన్యం తీసుకొచ్చిన రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.2,060 ఉండ గా, మార్కెట్‌లో రూ.1,700 దాటడం లేదు.
దొడ్డు రకం ధాన్యానికి ధర తగ్గింపు
పేట మార్కెట్‌లో రూ.1,700 దాటని రేటు
లబోదిబోమంటున్న రైతులు
సూర్యాపేట సిటీ, ఏప్రిల్ 18: సూర్యాపేట వ్యవసా య మార్కెట్‌లో రైతులు వ్యాపారుల చేతుల్లో నిలువు దోపిడీకి గురవుతున్నారు.చేసేది లేక ఆరుగాలం కష్టించి పండించిన పంటను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. మార్కెట్‌కు దొడ్డురకాలైన ఐఆర్-64, 1010 ధాన్యం తీసుకొచ్చిన రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.2,060 ఉండ గా, మార్కెట్‌లో రూ.1,700 దాటడం లేదు. రైతుల అవసరాలను ఆసరా చేసుకొని వ్యాపారులు అడ్డుగోలుగా ధరలు నిర్ణయిస్తూ నిలువునా దోసుకుంటున్నారు. తక్కువ ధర వ స్తున్నప్పుడు అండగా ఉండాల్సిన మార్కెట్ అధికారులు కా ర్యాలయానికే పరిమితమవుతుండటంతో తమ గోడును ప ట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుగోలుగా ధరల కేటాయింపు
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు ధా న్యానికి అడ్డుగోలుగా ధర నిర్ణయిస్తున్నారు. వారికి నచ్చిన ధర కేటాయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. మంగళవారం పేట మార్కెట్‌కు 32,135 బస్తాల ధాన్యం వచ్చింది. ఐఆర్-64 రకం ధాన్యాన్ని 214 మంది రైతులు 11,061 బస్తాల్లో తీసుకువచ్చారు. వారిలో కేవలం ఒక్క రైతుకు మాత్రమే రూ.1,735 చెల్లించిన వ్యాపారులు మిగిలిన 213 మంది రైతులకు రూ.1,735 నుంచి రూ.1,300 మధ్య ధర నిర్ణయించారు. ఏ రైతుకు ఎంత ధర నిర్ణయించారనే విషయాన్ని మార్కెట్ అధికారులు బహిర్గతం చేయడం లేదు. నిబంధనలకు లోబడి ధరలు కేటాయిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నా, వారికి నచ్చిన ధర నిర్ణయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. చేతిలో ధాన్యం తీసుకొని ధర కేటాయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీదుదారులు, కమీషన్‌దారులు కుమ్మకై ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.
రెండు రకాల ధాన్యమంటూ రూ.1,300 ధర ఇచ్చారు : - బత్తుల భాగమ్మ, చంద్రన్నకుంట, సూర్యాపేట
ఐఆర్-64 రకం ధాన్యాన్ని 40 బస్తాలు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చా. అందులో సన్నరకం ధాన్యం కలిసిందని క్వింటాకు రూ.1,300 ధర నిర్ణయించారు. కమీషన్‌దారుడిని ధర పెంచాలని అడిగినా ఆ ధర రావడమే గొప్ప అన్నాడు. మార్కెట్‌లో మా గోడును పట్టించుకునే అధికారులే లేరు.