మేలో బీ.వెల్లెంల ఉదయ సముద్రం ప్రారంభిస్తాం

ABN , First Publish Date - 2023-04-27T00:29:07+05:30 IST

మధ్య తరహా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మాణం పూర్తికావస్తున్న మండలంలోని బీ.వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును మే నెలలో సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజే యిస్తా మని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.

మేలో బీ.వెల్లెంల ఉదయ సముద్రం ప్రారంభిస్తాం
నార్కట్‌పల్లి: ఉదయ సముద్రం ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి

నార్కట్‌పల్లి, ఏప్రిల్‌ 26: మధ్య తరహా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్మాణం పూర్తికావస్తున్న మండలంలోని బీ.వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును మే నెలలో సీఎం కేసీఆర్‌తో ప్రారంభింపజే యిస్తా మని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. ప్రాజెక్టుకు సంబం ధించి కట్టంగూర్‌ మండలం పిట్టంపల్లిలో కాల్వ, టన్నెల్‌లతో పాటు నార్క ట్‌పల్లి మండలం చౌడంపల్లిలోని పంప్‌హౌస్‌ను ప్రాజెక్టు ఎస్‌ఈ అజయ్‌కు మార్‌, ఈఈ సత్యనారాయణలతో కలిసి బుధవారం పరిశీలించారు. పనులు వేగవంతం చేసి మే నెల నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. లక్ష ఎకరాలకు సాగు నీరు, వందలాది చెర్వులకు తాగునీటిని అందించే ఈ పెద్ద ప్రాజెక్టు మన ప్రాంతంలో ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును తన హ యాంలో ప్రారంభానికి నోచుకోవడం తన అదృష్టమన్నారు. ఎట్టి పరిస్థితు ల్లోనూ మే నెలలో ప్రాజెక్టును ప్రారంభించి రిజర్వాయర్‌ను నింపు తామని కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతామన్నారు. సమావేశంలో కట్టంగూర్‌ జడ్పీటీసీ తరాల బలరాం, యానాల అశోక్‌రెడ్డి, బీ.వెల్లెంల ఎంపీటీసీ చిరు మర్తి యాదయ్య, చిన్ననారాయణపురం సర్పంచ్‌ కొత్త నర్సింహ, చింతల సోమన్న, ప్రాజెక్టు డీఈఈ విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్‌: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతే పల్లి మండలంలోని గుడివాడలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలిం చా రు. తడిసిన ఽధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నకిరేకల్‌ మార్కెట్‌ చైర్మన్‌ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, చల్లా కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కట్టంగూరు: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని పిట్టంపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పాలడుగు హరికృష్ణ, సర్పంచులు పనస సైదులు, వడ్డె సైదిరెడ్డి, జానీపాషా, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏడాది లోపు నెల్లికల్‌ లిఫ్టు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే భగత్‌

తిరుమలగిరి(సాగర్‌): వచ్చే ఏడాది మే నాటికి నెల్లికల్‌ లిఫ్టు పనులను పూర్తిచేసి కృష్ణపట్టె రైతాంగానికి సాగునీరు అందించే చిరకాల కలను సాకారం చేస్తామని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. మండలంలోని నెల్లికల్‌ లిఫ్టు పనులను బుధవారం పరిశీలించారు. లిఫ్టు ఏర్పాటు చేసే ప్రాంతంలో సాగర్‌ ప్రాజెక్టు నీటితో నిండినా పనులకు ఆటకం కలగకుండా నిర్మిస్తున్న రింగ్‌బండ్‌ను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ లిఫ్టు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పనులకు నిధుల కేటాయింపుతోపాటు పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. సాగర్‌ జలాల నుంచి అప్రోచ్‌ కెనాల్‌, మోటార్లు ఏర్పాటు, పొలాలకు నీరందించే పైపులైన్ల పనులు సమాంతరంగా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కృష్ణపట్టె ప్రాంతంలో ఓట్ల కోసం మంత్రి పదవులు నిర్వహించిన జానారెడ్డి లిఫ్టు ఏర్పాటు చేస్తానని హామీలు గుప్పించారే తప్ప దానిని ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య, నాయకులు జటావత్‌ పాండునాయక్‌, దేవుడునాయక్‌, మేకపోతుల కార్తిక్‌, మల్లిఖార్జున్‌, రమేష్‌నాయక్‌, బానునాయక్‌, బషీర్‌, రవినాయక్‌ ఉన్నారు.

హాలియా: పేద ప్రజల ఆరోగ్య భద్రతకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసాగా ఉందని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దవూర, తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మంది లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య, జటావత్‌ రవినాయక్‌, పోతుగంటి తిరుమల్‌, షేక్‌ బషీర్‌, మంద రఘువీర్‌, కాటు కృష్ణ, బాలవర్ధిరాజు, శంకర, శ్రీకర్‌నాయక్‌, రాజేష్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-27T00:29:07+05:30 IST