మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-03-08T00:25:41+05:30 IST

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎంపీపీ చెన్ను అనురాధాసుందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో పలు రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సన్మానించారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పెద్దవూరలో మహిళలను సన్మానిస్తున్న ఎంపీపీ అనురాధ

పెద్దవూర / కొండమల్లేపల్లి / నల్లగొండ కల్చరల్‌, మార్చి 7: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎంపీపీ చెన్ను అనురాధాసుందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో పలు రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సేవ చేస్తూ సమాజానికి గుర్తింపు తెస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీవో విజయకుమారి, అంగనవాడీ సీడీపీవో గంధం పద్మావతి, సూపర్‌వైజర్‌ కమలాబాయి, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ జ్యోత్స్న, ఉపాధ్యాయురాలు శైలజ, అంగనవాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఫ కొండమల్లేపల్లి మండలం గుర్రపుతండాలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రమావత సేవానాయక్‌ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్‌ భవనలో మహిళా ఉద్యోగులకు పాటల పోటీలు, క్విజ్‌, మ్యూజికల్‌ చైర్‌, అంత్యాక్షరి పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు.

కార్యక్రమంలో తహసీల్దార్‌ దుర్గా మల్లేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్‌ కవిత, మాధవి, రమాదేవి, సోమేశ్వరీ, అనురాధ, వరలక్ష్మి, రేణుక, వెంకటరమణ, వెంకటరమణమ్మ, శైలజ, ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన మంత్రవాది శ్రవణ్‌కుమార్‌, సెక్రటరీ ముజిబుద్దీన, కిరణ్‌కుమార్‌, దయాకర్‌రావు, ఆకునూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-03-08T00:25:41+05:30 IST