MP Aravind: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అనేది కేసీఅర్ మాయ..

ABN , First Publish Date - 2023-01-13T16:08:23+05:30 IST

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ (Crime Rate)ను పెంచి పోషిస్తున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ (MP Aravind) విమర్శించారు.

MP Aravind: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అనేది కేసీఅర్ మాయ..

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ (Crime Rate)ను పెంచి పోషిస్తున్నారని బీజేపీ ఎంపీ అరవింద్ (MP Aravind) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double Bedroom Houses) అనేది సీఎం కేసీఅర్ (CM KCR) మాయ అని, దీనిపై గృహ నిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి (Minister Prashanth Reddy) జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కాళ్లు మొక్కి సీఎంఅర్ఎఫ్ ఇప్పించాల్సిన.. ఖర్మ ఏంటి మంత్రి?... అందుకేనా ప్రజలు ఓట్లేసింది? అంటూ ప్రశ్నించారు.

జగిత్యాలలో 40 శాతం రెండు పడక గదుల ఇళ్లు ముస్లింలకు ఇచ్చారని, అసెంబ్లీ పరిధిలో 10 శాతం జనాభా లేని ముస్లింలకు 40 శాతం ఎలా ఇస్తారని అరవింద్ ప్రశ్నించారు. 15 నెలల కాలంలో తన ఫౌండేషన్ నుంచి.. రూ.29 లక్షలు బూత్ లెవల్ కార్యకర్తలకు ఇచ్చానని చెప్పారు. ఇక్కడ చేసేది ఏమీ లేనట్టు బీఆర్ఎస్ పేరుతో దేశంలో తిరుగుతారంట.. అంటూ ఎద్దేవా చేశారు. మూడేళ్లుగా తెగుళ్ల బారిన పడి పసుపు నాణ్యత పడిపోయిందని, ఫసల్ బీమా పెట్టి ఉంటే రైతులకు ఈ సమయంలో మేలు జరిగేదని ఎంపీ అరవింద్ అన్నారు.

Updated Date - 2023-01-13T16:08:27+05:30 IST