గోపాలమిత్రలకు ఆపన్న హస్తం అందేనా?

ABN , First Publish Date - 2023-08-17T23:39:05+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాడి పశువుల సంతతి పెంచడంతో పాటు, పాల సేకరణ అభివృద్ధి చేసేందుకు గాను 2001 సంవత్సరంలో పశుగణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థకు చైర్మన్‌ను నియమించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా గోపాలమిత్రలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 130మంది గోపాలమిత్రలను నియమించారు. దీని ద్వారా నియామకం అయిన గోపాలమిత్రలు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ మేలు రకం జాతి దూడలను ఉత్పత్తి చేసేందుకు కృత్రిమ గర్భధారణ కోసం వీర్యాన్ని (సిమన్స్‌) ఇంజక్షన్‌ ద్వారా గేదేకు వేస్తారు. దీంతో గ్రామాల్లో మేలు జాతి రకం గేదెలు పెరగడంతో పాటు పాల సేకరణ పెరుగుతోంది.

గోపాలమిత్రలకు ఆపన్న హస్తం అందేనా?
పశువైద్య శిబిరంలో మేకకు టీకా వేస్తున్న గోపాలమిత్ర

- 20 ఏళ్లుగా అందిస్తున్న సేవలు

- ఉద్యోగ భద్రత కోసం ఎదురు చూపులు

- 10 నెలలుగా అందని పెంచిన పిఆర్‌సీ

పెద్ద కొడప్‌గల్‌, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో పాడి పశువుల సంతతి పెంచడంతో పాటు, పాల సేకరణ అభివృద్ధి చేసేందుకు గాను 2001 సంవత్సరంలో పశుగణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థకు చైర్మన్‌ను నియమించడంతో పాటు జిల్లా వ్యాప్తంగా గోపాలమిత్రలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 130మంది గోపాలమిత్రలను నియమించారు. దీని ద్వారా నియామకం అయిన గోపాలమిత్రలు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ మేలు రకం జాతి దూడలను ఉత్పత్తి చేసేందుకు కృత్రిమ గర్భధారణ కోసం వీర్యాన్ని (సిమన్స్‌) ఇంజక్షన్‌ ద్వారా గేదేకు వేస్తారు. దీంతో గ్రామాల్లో మేలు జాతి రకం గేదెలు పెరగడంతో పాటు పాల సేకరణ పెరుగుతోంది. దీంతో పాటుగానే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కొనసాగే పశువైద్య సిబ్బందికి వైద్యసేవలలో సహాయంగా ఉంటారు. 22 సంవత్సరాలుగా సేవలు చేస్తున్న తమకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా తాత్కాలిక పద్ధతిలోనే ఉంటున్నామని, ఉద్యోగ భద్రత కరువు కావడంతో పాటు, వేతనాలు సరిగా రావడంలేదని వాపోతున్నారు.

12 వందల వేతనంలో ఉద్యోగం షురూ..

2001 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో గోపాలమిత్రల నియామకం జరిగింది. అప్పట్లో 12 వందల గౌరవ వేత నంతో గోపాలమిత్రలు ఉద్యోగం ప్రారంభించారు. తర్వాత కొద్ది రోజులకు 2వేలు జీతం రాగా, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్‌ మిత్రల జీతాన్ని రూ.3,500లకు పెంచారు. అదే వేతనంతో సంవత్సరాలుగా పనిచేిసిన గోపాలమిత్రల విన్నపం మేరకు ప్రభుత్వం 2018లో వీరి జీతాన్ని రూ.8,500లకు పెంచింది.

పెంచిన పీఆర్‌సీ అమలుకు నోచుకోలేదు

2022 నవంబరులో ప్రభుత్వం అన్ని వర్గాల ఉద్యోగులకు 30 శాతం పీఆర్‌సీ ఇచ్చింది. దీంతో తమ వేతనం కూడా పెరిగి వస్తోందని గోపాలమిత్రలు సంతోషంతో ఉండగా, సుమారు 10 నెలలు గడుస్తున్నా ఇంకా పెంచిన పీఆర్‌సీ అందడం లేదని మిత్రలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం రూ.8,500 వేతనం వస్తుండగా, పెంచిన పీఆర్‌సీతో 11వేల పైగా వేతనం వస్తుంటే తమకు కొంచెంలో కొంచెం నయముంటుడేనని గోపాలమిత్రలు తెలిపారు.

నెల వారీ టార్గెట్‌ కాకుంటే జీతం సున్నా..

జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న గోపాలమిత్రలకు నెల వారీ టార్గెట్స్‌ ఉంటాయి. నెలకు కనిష్టంగా 75 సిమన్స్‌ను(వీర్యం)ను పశుగణాభివృద్ధి సంస్థ నుంచి కొనుగోలు చేసి వాటిని గ్రామాల్లో గేదెలకు అందించాలి. ఈ టార్గెట్స్‌ ఒక్కో నెలలో ఒక రకంగా ఉంటాయి. నెలకు 40 నుంచి 100 వరకు కూడా సిమన్స్‌ (వీర్యం) స్టిక్స్‌ కొనుగోలు చేయాలి. ఇందుకు సంబంధించి ఒక్కో సిమన్‌కు రూ.40 చొప్పున పశుగణాభివృద్ధి సంస్థ ఖాతాకు జమ చేయాలి. ఒక వేళ ఏదైనా ఒక నెలలో టార్గెట్‌ రాకుంటే ఆ నెల గోపాలమిత్ర జీతం రానట్టే.

నెల నెల వేతనం సక్రమంగా అందని పరిస్థితి

గోపాలమిత్రలకు నెలనెల వేతనం రాక కూడా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందని పలువురు గోపాలమిత్రలు తెలిపారు. వేతనం నెలనెల కాకుండా 3 నుంచి 6 నెలలకు ఒకసారి వస్తుందని, ఫిబ్రవరి 2023 నెల నుంచి ఇప్పటి వరకు ఇంకా వేతనం రాలేదని గోపాలమిత్రలు తెలిపారు.

ఉద్యోగ భద్రత కరువు

తాము సుమారుగా 22 సంవత్సరాలుగా గోపాలమిత్రలుగా పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వారు వాపోతున్నారు. తమతో పాటు ఇతర శాఖల్లో నియామకం అయిన వారు శాశ్వత ఉద్యోగులుగా మారారని, తాము మాత్రం ఇంకా తాత్కాలిక పద్ధతిలోనే సేవలు అందిస్తున్నామని తె లిపారు. తమకు వేతనాలు పెంచడంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.

మంత్రి కేటీఆర్‌కు వేడుకోలు

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామాత్యులు కేటీఆర్‌ తమ గోడు విని తమ బాధలు తీర్చాలని ఈ నెల 14న ఎల్లారెడ్డికి వచ్చిన కేటీఆర్‌కు తమ పరిస్థితిపై వినతిపత్రం ఇచ్చారు. తరువాత రోజు ఆగస్టు 15న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో రాష్ట్ర గోపాలమిత్రలు అంతా కలిసి తమ సమస్యలు తీర్చాలని కేటీఆర్‌కు విన్నవించారు. గోపాలమిత్రలందరిని శాశ్వత పద్ధతిన పశు సంవర్థక శాఖలో విలీనం చేయాలని కేటీఆర్‌కు విన్నవించారు. మరి గోపాలమిత్రలను ప్రభుత్వం ఆదుకుంటుందో లేదో వేచి చూడాలి.

సిద్దూ, గోపాలమిత్ర, చిల్లర్గి

జిల్లాలో పని చేస్తున్న గోపాలమిత్రలందరం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. వేతనం ఎంత వస్తుంది అని చూడకుండా గ్రామాల్లో తిరుగుతూ పశు సంపదను పెంచడంతో పాటు, పాల సేకరణ పెంచుతున్నాం. వీటితో పాటుగా వైద్య సిబ్బందితో కలిసి పశు వైద్య శిబిరాల్లో సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలు పెంచాలి.

అహ్మద్‌, గోపాలమిత్ర, చిల్లర్గి

నేను 22 సంవత్సరాలుగా గోపాలమిత్రగా సేవలు అందిస్తున్నా. మాతో పాటు ఇతర శాఖలలో తాత్కాలిక పద్ధతిని ఉన్న ఉద్యోగులు నేడు పర్మినెంట్‌ అయ్యారు. వేము కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పశుసంవర్ధక శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని ఇటీవల కేటీఆర్‌ను కలిశాం. ప్రభుత్వం ఆదుకుని మాకు మేలు చేయాలని కోరుతున్నాం.

Updated Date - 2023-08-17T23:39:05+05:30 IST