మెడికల్ కళాశాలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2023-09-15T23:58:00+05:30 IST
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిన శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కామారెడ్డి మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిలు వీక్షించారు. అంతకు ముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైద్య కళాశాల లెక్చరర్ గ్యాలరీకి పూజా కార్యక్రమం చేసి ప్రారంభించారు.
- ప్రారంభోత్సవ వేడుకను వీక్షించిన స్పీకర్ పోచారం, విప్ గంప గోవర్ధన్
- వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిన సీఎం కేసీఆర్
- వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అభ్యర్థిగా కేసీఆర్
- స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిన శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కామారెడ్డి మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిలు వీక్షించారు. అంతకు ముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైద్య కళాశాల లెక్చరర్ గ్యాలరీకి పూజా కార్యక్రమం చేసి ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కళాశాలను ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా మరో 5వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించి స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో స్పీకర్ ప్రసంగించారు. తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చార న్నారు. పేద ప్రజలకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందు కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచడమే కాకుండా మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ వస్తారన్నారు. ఇందులో భాగం గానే ప్రతీ జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ ఏర్పడక ముం దు రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కళాశాలలే ఉండేవని ప్రస్తు తం వాటి సంఖ్య 26 మెడికల్ కళాశాలకు చేరాయని అన్నారు. మరో 8 మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయ న్నారు. ఈ మెడికల్ కళాశాల ద్వారా ప్రతీ సంవత్సరం పది వేల మంది వైద్యులు తయారవుతారని అన్నారు. ఈ వైద్యులతో రాష్ట్రంలోని ప్రజలకే కాకుండా దేశ వ్యాప్తంగా సేవలు అందించ వచ్చని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి ఎమ్మె ల్యే అభ్యర్థిగా కేసీఆర్ ఉండనున్నారని స్పీకర్ గుర్తు చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కామారెడ్డి కొత్త జిల్లాగా ఏర్పాటుతో పాటు కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ఇప్పుడు నూతన మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నా మన్నారు. ఏకంగా సీఎం కేసీఆరే కామారెడ్డికి వస్తున్నందున భవిష్యత్తులో కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి బాటలో నడవనుందన్నారు. కామారెడ్డి కాకుండా బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు అభివృద్ధి బాట పడుతాయ న్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజిబొద్ధీన్, జడ్పీ చైర్‌పర్‌పర్సన్ దఫేదార్ శోభ, మున్సిపల్ చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి, డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌లు తదితరులు పాల్గొన్నారు.