అబద్ధపు హామీల మాయలో పడొద్దు

ABN , First Publish Date - 2023-08-17T01:26:31+05:30 IST

అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇప్పుడు చందమామ తీసుకొచ్చి మీ వొళ్లో పెడతామని మాయమాటలు చెబుతున్నారని వారి అబద్ధపు హామీల మాయలో పడొద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

అబద్ధపు హామీల మాయలో పడొద్దు

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ముప్కాల్‌, ఆగస్టు 16: అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇప్పుడు చందమామ తీసుకొచ్చి మీ వొళ్లో పెడతామని మాయమాటలు చెబుతున్నారని వారి అబద్ధపు హామీల మాయలో పడొద్దని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం బాల్కొండ మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా కంటే ముందు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధి కంటే రెండు రెట్లు అధికంగా గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గాలో అభివృద్ధి పరంపర కొనసాగుతోందన్నారు. ప్రతీరోజూ రూ.కోటి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. సోషల్‌ మీడియాలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఎన్నికల సమయంలో బాండ్‌ పేపర్‌ రాసిచ్చి రైతులను మోసం చేసిన ఎంపీ అర్వింద్‌ అడ్రస్‌ లేకుండా పోయాడని విమర్శించారు. మోసపూరిత హామీలతో ఎంపీగా గెలిచి ఒక అభివృద్ధి అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తా నని ఐదేళ్లు అయినా బోర్డు ఊసే లేదన్నారు. అంతకు ముందు బాల్కొం డ, కిసాన్‌నగర్‌ ప్రజలు డప్పుచప్పుళ్లతో మహిళల మంగళ హారతులతో, గజమాలతో మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, ముస్కు భూమేశ్వర్‌, ఎంపీపీ లావణ్యలింగాగౌడ్‌, జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్‌, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌యాదవ్‌, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం..

కమ్మర్‌పల్లి: బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మండలంలోని నాగాపూర్‌, నర్సాపూర్‌ గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన పలువురు కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రేగుం ట దేవేందర్‌, బద్దం చిన్నారెడ్డి పాలెపు కిరణ్‌, ఇంద్రాల రాజేందర్‌, రా జాగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-17T01:26:31+05:30 IST