Kamareddy Master Plan: కామారెడ్డిలో అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్
ABN , First Publish Date - 2023-01-06T09:25:40+05:30 IST
కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా బంద్ కొనసాగుతోంది.
కామారెడ్డి: కామారెడ్డిలో కొత్త మాస్టర్ ప్లాన్ (Kamareddy New MasterPlan)కు వ్యతిరేకంగా బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా అఖిలపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. అటు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి అఖిలపక్ష నాయకుల ఇంటి ముందు పోలీసులు మోహరించారు. రైతు జేఏసీకి కామారెడ్డి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా మద్దతు పలుకుతున్నాయి.
మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో రైతు జేఏసీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) సూచన మేరకు కాంగ్రెస్ నేతలు రెండు బృందాలుగా కామారెడ్డికి వెళ్తున్నారు. కిసాన్ కాంగ్రెస్ నుంచి కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డిల నేతృత్వంలో ఒక బృందం.. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ తోపాటు సీనియర్ నాయకులతో మరో బృందం కామారెడ్డికి బయలుదేరింది.