Home » Kamareddy
మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే సాధారణంగా దక్కుతాయి. కానీ, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక వినూత్నంగా జరిగింది.
సమగ్ర కుటుంబ సర్వేలో కులాల జాబితాలో తమ కులం పేరు లేదంటూ కామారెడ్డి జిల్లా పెద్దకొడ్‌పగల్ మండలంలో 2 వేల మథుర లంబాడా కుటుంబాలు సర్వేను బహిష్కరించాయి.
కామారెడ్డి జిల్లాలో కొందరు ముఠాగా ఏర్పడి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. కామారెడ్డిలోని తన కార్యాలయంలో ఎస్పీ సోమవారం విలేకరులతో మాట్లాడారు.
కామారెడ్డి జిల్లాలోని డీసీఆర్బీ (డిస్ట్రిక్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో) విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ మదన్‌లాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పలు అవినీతి ఆరోపణలతో మూడు రోజుల క్రితమే ఆయన్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కామారెడ్డి జిల్లా ఉమ్మడి మద్నూర్ మండలంలోని రుసేగావ్, సోమూర్ గ్రామాల్లో ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.
కామారెడ్డి జిల్లాలో సోమవారం కురిసిన అకాలవర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. జిల్లాలోని ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్, కామారెడ్డిలో సోమవారం వర్షం కురిసింది.
గత పదేళ్ల పాలనలో రైతులు, నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్.. ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో అనేక చోట్ల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి ఈ రేవంత్ సర్కార్ ఈసీ సర్టిఫికెట్స్ కూడా జారీ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇదంతా చేస్తుందని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం మధ్య తరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడారన్నారు.
కామారెడ్డి జీవధాన్ హైస్కూల్లో ఓ విద్యార్థిని 8వ తరగతి చదవుతోంది. అయితే అదే పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఓ కామాంధుడు.. బాలికపై కన్నేశాడు. రోజూ అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించాడు.
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పాపులర్ అయ్యేందుకు ఔత్సాహికులు వింతవింత చేష్టలు చేస్తున్నారు. పది మందిలో విన్యాసాలు చేస్తూ కొంతమంది నవ్వులపాలు అవుతుంటే మరికొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు.