లక్కెవరిదో..!
ABN , First Publish Date - 2023-08-21T01:28:02+05:30 IST
రెండేళ్ల కాలపరిమితితో నిర్వహించే ఎక్సైజ్ టెండర్ల దరఖాస్తు శుక్రవారంతో ముగిసింది. 2021-23 మద్యం పాలసీ కంటే 2023-24 పాలసీలో దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఆదాయం రూ.43.48 కోట్లు వచ్చింది. గతేడాది కంటే 23 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే మహిళల పేరిట కూడా ఎక్కువ మంది టెండర్లు వేశారు. జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం లక్కీడ్రా నిర్వహించనున్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పర్యవేక్షణలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్‌రాజ్ ఆధ్వర్యంలో ఇవి కొనసాగనున్నాయి.
- నేడు జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాలకు డ్రా
- రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాట్లు చేసిన అధికారులు
- గతేడాదిని మించిన టెండర్లు
- దరఖాస్తుల ద్వారా రూ.43.48 కోట్ల ఆదాయం
- బంజేపల్లి వైన్స్‌కు అత్యధికంగా దరఖాస్తులు
- అతి తక్కువగా మద్దెల చెరువు వైన్స్‌కు
- వైన్స్‌ల కోసం మహిళలు దరఖాస్తులు
కామారెడ్డి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల కాలపరిమితితో నిర్వహించే ఎక్సైజ్ టెండర్ల దరఖాస్తు శుక్రవారంతో ముగిసింది. 2021-23 మద్యం పాలసీ కంటే 2023-24 పాలసీలో దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఆదాయం రూ.43.48 కోట్లు వచ్చింది. గతేడాది కంటే 23 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే మహిళల పేరిట కూడా ఎక్కువ మంది టెండర్లు వేశారు. జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం లక్కీడ్రా నిర్వహించనున్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పర్యవేక్షణలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్‌రాజ్ ఆధ్వర్యంలో ఇవి కొనసాగనున్నాయి.
చివరి రోజే అధికం
నూతన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఈ నెల 4న నోటిఫికేషన్ జారీ కాగా జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 49 వైన్స్‌లకు 2174 దరఖాస్తులు రాగా ఈ దరఖాస్తుల వల్లనే ప్రభుత్వానికి రూ.43.48 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది మొత్తం 984 దరఖాస్తులు రాగా రూ.19.68 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గతంతో పోలిస్తే 1190 అదనంగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం 786 దరఖాస్తులు రావడం విశేషం. అత్యధికంగా నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి వైన్స్‌కు 88 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా పిట్లం మండలంలోని మద్దెలచెరువు వైన్స్‌కు 2 దరఖాస్తులు వచ్చాయి. 10 కంటే తక్కువగా వచ్చిన వైన్స్‌లకు మరోమారు టెండర్లను నిర్వహించనున్నారు.
దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులు
ఎక్సైజ్ శాఖ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో శుక్రవారం రాత్రి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి. కామారెడ్డి ఎక్సైజ్ సర్కిల్‌లో కామారెడ్డి సిరిసిల్లా రోడ్డులోని షాప్ నెంబర్ 1కు 53 దరఖాస్తులు, షాపు నెంబర్ 2కు 48, షాపు నెంబర్ 3కు 54, షాపు నెంబర్ 4కు 63, హైదరాబాద్ రోడ్డులోని షాపు నెంబర్ 5కు 44, షాపు నెంబర్ 6కు 57 దరఖాస్తులు, కొత్త బస్టాండ్ పరిధిలోని షాపు నెంబర్ 7కు 58, షాపు నెంబర్ 8కు 45, షాపు నెంబర్ 9కు 56, రామారెడ్డి విలేజ్ షాపు నెంబర్ 10కు 58, మాచారెడ్డి విలేజ్ షాపు నెంబర్ 11కు 31, షాపు నెంబర్ 12కు 36, సదాశివనగర్ విలేజ్ షాపు నెంబర్ 13కు 45, పద్మాజీవాడి విలేజ్ షాపు నెంబర్ 14కు 54, వెల్పుగొండ విలేజ్ షాపు నెంబర్ 15కు 42, దోమకొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో దోమకొండ విలేజ్ షాపు నెంబర్ 16కు 49, షాపు నెంబర్ 17కు 46, భిక్కనూర్ విలేజ్ షాపు నెంబర్ 18కు 58, షాపు నెంబర్ 19కు 52, బీబీపేట విలేజ్ షాపు నెంబర్ 20కు 25, షాపు నెంబర్ 21కు 33, రాజంపేట విలేజ్ షాపు నెంబర్ 22కు 72, తాడ్వాయి విలేజ్ షాపు నెంబర్ 23కు 86 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎల్లారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఎల్లారెడ్డి షాపు నెంబర్ 24కు 47, షాపు నెంబర్ 25కు 49, లింగంపేట షాపు నెంబర్ 26కు 38, లింగంపేట షాపు నెంబర్ 27కు 43, గాంధారి విలేజ్ షాపు నెంబర్ 28కు 36, గాంధారి షాపు 29కు 48, నాగిరెడ్డిపేట విలేజ్ షాపు నెంబర్ 30కు 62, బాన్సువాడ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని బాన్సువాడ షాపు నెంబర్ 31కు 27, షాపు నెంబర్ 32కు 28, షాపు నెంబర్ 33కు 29, షాపు నెంబర్ 34కు 35, షాపు నెంబర్ 35కు 28, బీర్కూర్ విలేజ్ షాపు 36కు 57, నస్రూల్లాబాద్ షాపు నెంబర్ 37కు 29, షాపు నెంబర్ 38కు 22, నిజాంసాగర్(బంజేపల్లి)షాపు 39కు 88, బిచ్కుంద సర్కిల్ పరిధిలోని బిచ్కుంద షాపు నెంబర్ 40కు 47, షాపు నెంబర్ 41కు 55, జుక్కల్ విలేజ్‌షాపు నెంబర్ 42కు 32, షాపు నెంబర్ 43కు 33, మద్నూర్ షాపు నెంబర్ 44కు 25, షాపు నెంబర్ 45కు 31, పిట్లం విలేజ్ షాపు నెంబర్ 46కు 52, షాపు నెంబర్ 47కు 51, మద్దెల చెరువు విలేజ్‌షాప్ నెంబర్ 48కు 2, పెద్ద కొడపగల్ విలేజ్ షాపు నెంబర్ 49కు 15 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుదారులు 10 గంటల వరకు ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలి
- రవీందర్‌రాజ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి
జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించగా 2174 దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించిన డ్రా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్నాం. ఉదయం 10 గంటల వరకు దరఖాస్తుదారులు ఫంక్షన్‌హాల్‌కు చేరుకోవాలి. 11 గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీస్తాం. దరఖాస్తుదారుడు హాజరు కానట్లయితే వారికి సంబంధించి టోకెన్ నెంబర్ డ్రాలో వేయబడదు. దరఖాస్తుదారుడు తమ ఎంట్రీ పాసులతో విధిగా ఫంక్షన్‌హాల్‌లో జరిగే డ్రాకు హాజరు కావాలి.