కూతురు వివాహం రద్దయిందని తల్లి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-06-18T00:59:18+05:30 IST
మండల కేంద్రంలోని మత్తడి కింది పల్లెకు చెందిన నర్వ సవిత(36) తన కూతురు వివాహం రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
లింగంపేట, జూన్ 17 : మండల కేంద్రంలోని మత్తడి కింది పల్లెకు చెందిన నర్వ సవిత(36) తన కూతురు వివాహం రద్దు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ సవిత కూతురు మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన వారి బందువుల అబ్బాయి మూగ విఠల్‌తో వివాహం నిశ్చయమైంది. మూడు నెలల తర్వాత వివాహం చేయాలని ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వివాహం కోసం సవిత భర్త ఆశయ్య ఉన్న ఇంటిని అమ్ముకుని ఖర్చులకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇంతలోనే వరుడు విఠల్ మరో అమ్మయిని తీసుకుని పారిపోయాడు. దీంతో తన కుమార్తె వివాహం ఆగిపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈనెల 15న సవిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఆశయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు.