మద్యం టెండర్లపై నాయకుల నజర్
ABN , First Publish Date - 2023-08-18T00:35:31+05:30 IST
జిల్లాలో మద్యం షాపుల టెం డర్లపై అన్ని పార్టీల నేతలు నజర్ పెట్టారు. టెండర్లకు ఒక రోజు మిగిలి ఉండగా జోరుగా దర ఖాస్తులను అందజేస్తున్నారు.
తమ అనుచరుల ద్వారా టెండర్ల దాఖలు
ఆసక్తి చూపుతున్న ఉద్యోగులు, వ్యాపారులు
నేడు దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు
నిజామాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మద్యం షాపుల టెం డర్లపై అన్ని పార్టీల నేతలు నజర్ పెట్టారు. టెండర్లకు ఒక రోజు మిగిలి ఉండగా జోరుగా దర ఖాస్తులను అందజేస్తున్నారు. దరావత్ ఫీజు ఎక్కువగా ఉన్నా.. వెన కడుగు వేయడం లేదు. సిండికేట్‌గా మారి ఎక్కువ మొత్తంలో షాపులకు టెం డర్లు వేస్తున్నారు. వచ్చేది వరుస ఎన్నికలు కావడం జోరుగా మద్యం అమ్మకాలు జరగ నుండటంతో రాజకీయ పార్టీల నేతలే కాకుండా రియల్ ఎస్టేట్, వ్యాపారులు, ఉద్యోగ సంఘాల నేతలు, ఇతర వర్గాలు ఎక్కువ మొత్తంలో దాఖలు చేస్తున్నారు. సరిహద్దు మద్యం షాపులకన్న కార్పొ రేషన్, శివారు మద్యం షాపులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. చివరిరోజు దగ్గరపడుతుం డటం తో గత టెండర్‌లో షాపులు పొందిన వారి తో పాటు ఇతరులు కూడా పెద్ద ఎత్తున వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
షాపులకు పెరిగిన డిమాండ్
జిల్లాలో ఈ దఫా మద్యం షాపులకు డిమాండ్ పెరిగింది. జిల్లాలోని 102 మద్యం షాపులకు టెండర్లు పిలువగా భారీ ఎత్తున దరఖాస్తులను చేస్తున్నారు. మొదట తక్కువ మొత్తంలో దరఖాస్తులు చేసిన వారు చివరి రోజుల్లో ఎక్కువ మొత్తంలో వేస్తున్నారు. జిల్లాలో గురువారం రోజు భారీగా దరఖాస్తులను చేశారు. చివరి రోజు శుక్రవారం ఎక్కువ మొత్తంలో వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనెల 21న టెండర్లను ఖరారు చేయనుండటం, గడువు ముగుస్తుండటంతో ఎక్కువ మంది వేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దరా వత్ 2లక్షల రూపాయలు ఉన్నా వెనకడుగు వేయడం లేదు. రిజర్వేషన్ల షాపులతో పాటు ఇతర మద్యం షాపులకు కూడా ఒకేరీతిలో దరఖాస్తులను అందజేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ మొత్తంలో అమ్మకాలు జరు గుతున్న మద్యం షాపులపై నజర్ పెట్టి ఎక్కువ మంది టెండర్లు వేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర సరిహ ద్దులను షాపులకు డిమాండ్ ఉండగా, రెండేళ్ల నుంచి అమ్మకాలు తగ్గాయి. మహారాష్ట్ర నుంచి సరుకు అక్రమంగా వస్తుండటంతో వాటికి డిమాండ్ తగ్గగా మిగతా షాపులకు దరఖాస్తులు పెరిగాయి.
వ్యాపారులు, రాజకీయ నేతల చూపు
ఈ దఫా మద్యం షాపులపై ఎక్కువ మంది వ్యాపా రులు రాజకీయ పార్టీల నేతలు దృష్టిపెట్టారు. తమ పరిధిలోని షాపులను తామే దక్కించుకు నేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని షాపులు రిజర్వేషన్లు ఉన్నా తమకు దగ్గరగా ఉన్న వారి ద్వారా టెండర్ల ను వేస్తున్నారు. కొన్ని మండలాలు, కార్పొరేషన్ పరిధిలో సిండి కేట్‌గా మారి దరఖాస్తు ల ను చేస్తున్నారు. ఒక్కొక్క షాపుకు 10 నుంచి 15 వర కు దరఖాస్తులు వేస్తున్నా రు. సిండికేట్‌గా మారిన వా రు 5 నుంచి 6 షాపులకు కొన్ని గ్రూపులు 10 షాపుల వరకు ఈ టెండర్లను వేస్తు న్నారు. ఒక్కొక్క షాపుకు 20 నుంచి 30లక్షల వరకు టెం డర్ల కోసమే వెచ్చిస్తున్నారు.
త్వరలో వరుస ఎన్నికలు
ఈ దఫా అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్, ఎంపీ టీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఎన్నికలు వరుసగా ఉండటంతో మద్యం ఎక్కువగా అమ్మకాలు జరుగ నుంది. అన్ని ఎన్నికలకు మద్యం ఎక్కువగా వినియో గిస్తుండటం వల్ల ఈ దఫా ఉద్యోగ సంఘాల నేతలతో పాటు కొంతమంది ఉద్యోగులు కూడా తమ కుటుంబ సభ్యులతో ఈ మద్యం టెండర్లను వేయిస్తున్నారు. వారి తో పాటు ఇతర రంగాల్లో ఉన్న వ్యాపారులు ముఖ్యం గా మిల్లర్లు కూడా ఈ దఫా పలు మండలాల పరిధిలో టెండర్లను తమ అనుచరుల ద్వారా దాఖలు చేయి స్తున్నారు. అధికార బీఆర్‌ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు కూడా టెండర్లలో పాల్గొం టున్నారు. తమ కుటుంబ సభ్యులు, ఇతరుల ద్వా రా వీటిని దాఖలు చేయిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 102 మద్యం షాపులకు 1706 దరఖాస్తులు రాగా గురు వారం ఒక్కరోజే 964 దరఖాస్తులు వచ్చాయి. గత టెండర్లలో జిల్లాలో 1762 వరకు దరఖాస్తులు రా గా, ఈ దఫా 2000లకు పైగా దరఖాస్తులు రావచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యా ప్తంగా అన్ని మద్యం షాపులకు 20 కన్న తక్కువగా దరఖాస్తులు రాకుం డా చూసుకోవడంతో పాటు అన్నింటిలో ఎక్కువగా వచ్చే విధం గా ఏర్పాట్లు చేస్తు న్నారు. జిల్లా వ్యాప్తం గా మద్యం షాపుల టెండర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఎక్సైజ్ సూపరిం టెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. చివరిరోజు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఏర్పాట్లు చేశామన్నారు. పూర్తిస్థాయి లో దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో పూర్తవు తుందని ఆయన తెలిపారు.