Nizamabad : అర్వింద్‌పై రైతుల కన్నెర్ర.. వినూత్న రీతిలో ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2023-03-31T11:16:11+05:30 IST

ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు తీసుకురాకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. దీంతో వినూత్న ఫ్లెక్సీలకు తెరదీశారు. ఇటీవలి కాలంలో ఫ్లెక్సీ వార్ సర్వసాధారణమై పోయింది.

Nizamabad : అర్వింద్‌పై రైతుల కన్నెర్ర.. వినూత్న రీతిలో ఫ్లెక్సీలు

నిజామాబాద్ : ఎంపీ అర్వింద్ (MP Arvind) పసుపు బోర్డు తీసుకురాకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. దీంతో వినూత్న ఫ్లెక్సీలకు తెరదీశారు. ఇటీవలి కాలంలో ఫ్లెక్సీ వార్ (Flexi War) సర్వసాధారణమై పోయింది. కానీ అర్వింద్‌కు వ్యతిరేకంగా వెలిసినవి మాత్రం కాస్త వినూత్నంగా ఉన్నాయి. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad) వ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పసుపు బోర్డు... ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని కాస్త వెటకారాన్ని యాడ్ చేసి మరీ నిజామాబాద్ అంతటా రైతులు ఫ్లెక్సీలను అంటించారు.

pasupu.jpg

ఖాళీగా ఉన్న పసుపు బోర్డుపై ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని రాసి నిరసన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసి ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో నిజామాబాద్‌కి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) , రామ్ మాధవ్‌ (Ram Madhav)లు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అర్వింద్ తమను మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-31T11:37:10+05:30 IST