14 మద్యం దుకాణాలకు రిజర్వేషన్‌లు ఖరారు
ABN , First Publish Date - 2023-08-04T00:08:08+05:30 IST
జిల్లాలోని 49 మద్యం దుకాణాల్లో 14 మద్యం దుకాణాలకు రిజర్వేషన్‌లు ఖరారు అయినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో లక్కీడ్రా చేపట్టారు. ఇందులో గౌడకులానికి 7, ఎస్‌సీలకు 5, ఎస్‌టీలకు 2 దుకాణాలు కేటాయించగా 35 జనరల్ కేటగిరిలో ఉన్నట్లు తెలిపారు. గౌడ కులస్తులకు 3,10,14,26,35,43,46 దుకాణాలు, ఎస్‌సీలకు 5,15,19,28,37 దుకాణాలు, ఎస్‌టీలకు 29,31 దుకాణాలు కేటాయించబడినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిటెండెంట్ రవీంద్రరాజు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అధికారులు, అబ్కారిశాఖ అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి, ఆగస్టు 3: జిల్లాలోని 49 మద్యం దుకాణాల్లో 14 మద్యం దుకాణాలకు రిజర్వేషన్‌లు ఖరారు అయినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో లక్కీడ్రా చేపట్టారు. ఇందులో గౌడకులానికి 7, ఎస్‌సీలకు 5, ఎస్‌టీలకు 2 దుకాణాలు కేటాయించగా 35 జనరల్ కేటగిరిలో ఉన్నట్లు తెలిపారు. గౌడ కులస్తులకు 3,10,14,26,35,43,46 దుకాణాలు, ఎస్‌సీలకు 5,15,19,28,37 దుకాణాలు, ఎస్‌టీలకు 29,31 దుకాణాలు కేటాయించబడినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిటెండెంట్ రవీంద్రరాజు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అధికారులు, అబ్కారిశాఖ అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉంది
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరించి వాహనం నడిపే విధంగా చూడాలన్నారు. హైవేలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారిపై అక్కడక్కడ ఏర్పడిన గుంతలను నేషనల్ హైవే అధికారులు త్వరలోనే పూడ్చి వేయాలని తెలిపారు. గత ఆరు నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమీక్ష జరిపారు. పిట్లం, సదాశివనగర్, భిక్కనూర్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగిన స్థలాలను గుర్తించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌టీవో వాణి, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, పోలీసు, విద్య, వైద్య, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తల్లిపాలు అమృతంతో సమానం
కామారెడ్డి టౌన్: తల్లిపాలు అమృతంతో సమానమని బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడారు. ప్రసవం అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు రోగ నిరోధకశక్తిని పెంచి బిడ్డను అనేక వ్యాధులు రాకుండా కాపాడతాయని అన్నారు. అధికారులు గ్రామస్థాయిలో బిడ్డ పుట్టిన ఆరు మసాల వరకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టించే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఇంటింటికీ వెళ్లి పాలిచ్చే తల్లులకు, గర్భిణులకు, తల్లిపాల ప్రాముఖ్యతపై ఏఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించే విధంగా అధికారులు చూడాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై రూపొందించిన యానిమేటెడ్ చిత్రాలు, వీడియోలు, కరపత్రాలను సామాజిక మాద్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా మారడానికి తల్లిపాలు దోహదపడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి రమ్య, డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.