కాంగ్రెస్‌తోనే బీసీలకు రాజ్యాధికారం

ABN , First Publish Date - 2023-08-17T01:29:03+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీతోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ ఎంపీ, బీసీ డిక్లరేషన్‌ కమిటీ చైర్మన్‌ వి.హన్మంత్‌రావు అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చని జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లు దక్కాలంటే బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

కాంగ్రెస్‌తోనే బీసీలకు రాజ్యాధికారం

బీసీ సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ వీహెచ్‌

నిజామాబాద్‌, ఆగస్టు 16: కాంగ్రెస్‌ పార్టీతోనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ ఎంపీ, బీసీ డిక్లరేషన్‌ కమిటీ చైర్మన్‌ వి.హన్మంత్‌రావు అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చని జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లు దక్కాలంటే బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బుధవారం నగరంలోని మున్నూరుకాపు సంఘంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి.హన్మంత్‌రావు మాట్లాడుతూ.. ప్రధానిమోదీ తాను బీసీనని చెబుతూ దేశంలోని బీసీలను మభ్యపెడుతున్నారని తొమ్మిదేళ్లలో బీసీలకు చేసిందేమీ లేదన్నారు. ఓబీసీల రిజర్వేషన్లు కూడా ఎత్తేసిన ఘనత బీజేపీది అన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు చేసిన భారత్‌ జోడో యాత్రతో బీజేపీకి భయం పుట్టుకుం దన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికలు వస్తున్నాయని బీసీలు గుర్తుకొస్తున్నారని అందుకే బీసీబంధు ఇస్తున్నారని బీసీలు ఎవరూ కేసీఆర్‌ మాయలో పడవద్దన్నారు. దళితబంధు, మైనార్టీబంధు పేర్లతో కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో నిర్వహించనున్న బీసీ గర్జన ద్వారా బీసీల బలమేంటో చూపిస్తేనే వచ్చే ఎన్నికల్లో బీసీలకు సీట్లు దక్కుతాయన్నారు. మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు కనీసం 50 శాతం సీట్లు ఇస్తేనే కాంగ్రెస్‌ అధి కారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీలకు సీట్ల కోసం తన ఎంపీ టికెట్‌ను సైతం వదులుకునేందుకు సిద్ధమని పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలోనే ఈ విషయాన్ని నేను ప్రస్థావి స్తున్నానని అన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రతి పార్లమెంట్‌ నియో జకవర్గంలో మూడు సీట్లు ఇచ్చేలా పోరాడుతామని ఈ విషయం లో వెనక్కి తగ్గేదిలేదన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉంటూ రాజ్యాఽ దికారం కోసం కృషి చేయాలని ఆయన అ న్నారు.. మాజీ విప్‌ అనిల్‌ మాట్లాడుతూ.. బీసీలు అన్ని విషయాల్లోనూ అనగ దొక్కబ డుతున్నారని వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నారు. కానీ కాంగ్రెస్‌ స్ర్కీనింగ్‌ కమిటీ, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీలో కూడా కేవలం ముగ్గురు బీసీలకే చోటు ఇచ్చారని దీనివల్ల వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతామని ఆయ న ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్‌, నగేష్‌రెడ్డి, ప్రేమలత అగర్వాల్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌

ఆత్మహత్యకు యత్నించిన సర్పంచ్‌కు పరామర్శ

బీఆర్‌ఎస్‌ నేతల వేధింపుల వల్ల ఆత్మహత్యకు యత్నించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్లెడ మాజీ సర్పంచ్‌ లావణ్యను బుధవారం మాజీ ఎంపీలు వి.హన్మంత్‌రావు, మధుయాష్కి, మానాల మోహన్‌రెడ్డి, కేశవేణు తదితరులు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌తో ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌, మధుయాష్కిలు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సర్పంచులు వేధింపులకు గురవుతున్నారని అందుకు నిదర్శనమే లావణ్య ఆత్మహత్యాయత్నం అని అన్నారు.హుందాన్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-17T01:29:03+05:30 IST