ఉపాధ్యాయుల బదిలీలపై ఉత్కంఠ
ABN , First Publish Date - 2023-09-04T01:22:36+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం హైకోర్టు గతంలో నిర్వహించిన బదిలీలపై స్టేను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి బదిలీ లకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.
ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ
రేపటి వరకు దరఖాస్తులకు అవకాశం
సెప్టెంబరు 1 కటాఫ్ డేట్చ్
నిజామాబాద్ అర్బన్, సెప్టెంబరు 3: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం హైకోర్టు గతంలో నిర్వహించిన బదిలీలపై స్టేను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి బదిలీ లకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. బదిలీల షెడ్యూ ల్ విషయంలో ఉపాధ్యాయుల్లో మిశ్రమ స్పం దన వ్యక్తమవుతోంది. అక్టోబరు 3లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించగా నెలరోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రక్రియలో ఏమైనా అవంతరాలు ఎదురై మళ్లీ బదిలీల ప్రక్రియ నిలిచిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొసుగులను కనిపెట్టి వాటి ద్వారా కోర్టుకెళ్లి బదిలీలను ఆపడం పనిగా పెట్టుకు న్న కొంతమంది తాజా షెడ్యూల్‌పై కూడా కోర్టుకు వెళ్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా షెడ్యూల్ ప్రకారం పీజీ ప్రధానోపాధ్యా యులందరికీ బదిలీ తప్పనిసరి కానుంది. జీవో 317లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు కేటా యించిన పాయింట్ల విషయంలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. ఖాళీలన్నింటినీ బదిలీల కోసం చూపిస్తే మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వచ్చే ఉపాధ్యా యుల పై స్పష్టత లేక పోవడం, ఒకే ఉపాధ్యా యుడు ఉన్న పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయిన రిలీవర్ రాకపోతే ఆ ఉపాధ్యాయులు అక్కడే ఉం డాల్సిన పరిస్థితి ఉంటుందని ఉపాధ్యా యులు ఆందోళన చెందుతున్నారు. ఒకే స్థానం లో ఐదేళ్ల పాటు పనిచేసిన పీజీ ప్రధానో పాధ్యాయులను లాంగ్ స్టాండింగ్‌గా గుర్తించి తప్పనిసరిగా బదిలీ చేసే అవకాశం ఉంది. బదిలీలలో వారి స్థానాన్ని ఖాళీగా చూపిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులంతా తమ స్థానాల్లో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారే ఉన్నందున వారు బదిలీలు తప్పనిసరి కానున్నాయి. అయితే ఒక క్యాడర్‌లోని ఉపాధ్యాయులను 40 శాతం కంటే ఎక్కువ మందిని ఒకేసారి బదిలీ చేయరాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబు తున్నారు. ఈ విషయంలో విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది.
3,404 దరఖాస్తులు
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్న తులకు సంబంధించి గత జనవరిలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వివిధ కేట గిరిలలో 3,404 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 1191 పాఠశాలలు ఉం డగా 4,752 మంది ఉపాధ్యా యులు ప్రస్తుతం పని చేస్తున్నారు. జిల్లాలో 8 ఏళ్లుగా ఒకే చోట పనిచే స్తున్న ఉపాధ్యా యులు 1250 మంది ఉన్నారు. జిల్లాలో సుమారు 1000 మంది ఉపాధ్యాయులు పదోన్న తులకు అర్హత కలిగి ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఇప్పుడు కొత్తగా షెడ్యూల్ ప్రకటించగా కొత్తవారు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కొత్తగా ఎడిట్ ఆప్షన్‌ను ఇచ్చారు. జిల్లాలో విద్యాశాఖలో ప్రస్తుతం 951 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో విడుదల చేసిన బదిలీల షెడ్యూల్ ప్రకారం ఒకేస్థానంలో 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పని సరిచేశారు. వారి స్థానాల్లో ఖాళీలను చూపించారు. ప్రస్తుతం విడుదల చేసిన బదిలీల మార్గదర్శకాలలో సీని యారిటీ కటాఫ్ డేట్‌ను సెప్టెంబరు 1గా నిర్ణయిం చడంతో ఒకేస్థానంలో 8 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2015 జూలై 25న జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో కొత్త స్థానాలకు వెళ్లిన వారంతా ఇప్పుడు వారి స్థానాల్లో 8 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో వారంతా బదిలీ కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. వీరి స్థానాలను ఖాళీ చూపించనున్నారు. గత జనవరిలో బదిలీల షెడ్యూల్ సందర్భంగా వచ్చిన దరఖాస్తుల కంటే ప్రస్తుతం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది.
మారుమూల పాఠశాలలపై ప్రభావం
తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల షెడ్యూల్ వల్ల జిల్లాలోని ఉన్న ఖాళీలన్నింటిని చూపిస్తే మారు మూల గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా మైదాన ప్రాంతాలకు బదిలీపై వెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే జిల్లాలోని కమ్మర్‌పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, కోటగిరి, వర్ని, సిరికొండ, తదితర మండలాలలో పాఠశాలలకులకు ఉపాధ్యాయులు వచ్చే పరిస్థితి ఉండదని ఉపాధ్యాయులు చెబుతు న్నారు. ఒకే టీచర్ ఉన్న పాఠశాలలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాల లు 126 ఉండగా ఈ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడికి రిలీవర్‌లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. ఆ స్థానాల్లో మరొకరు వచ్చి చేరితేనే అక్కడి ఉపాధ్యాయులు బయటకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లాలో 951 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఉపాధ్యాయులు కోరుకునే స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడు దల కాగా ఆదివారం నుంచి ఆన్‌లైన్ ద్వారా బదిలీల కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 6 నుంచి 7వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి. 8, 9 తేదీల్లో దరఖాస్తు చేసిన వారి జాబితాను ప్రదర్శించనున్నారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 12, 13 తేదీల్లో సీని యారిటీ జాబితాను ప్రదర్శిస్తారు. 14న ఎడిట్ చేసుకోవా ల్సి ఉంటుంది. 15న ఆన్‌లైన్ ద్వారా హెచ్‌ఎంల బదిలీలు, 16న హెచ్‌ఎంల ఖాళీలను వెల్లడిస్తారు. 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెం ట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తారు. 20, 21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్‌ల పోస్టులను వెల్ల డిస్తారు. 21న ఎస్ ఏలకు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చే అవకాశం కల్పించారు. 22న ఎడిట్ ఆప్షన్, 23, 24 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు, 24న స్కూల్ అసిస్టెంట్‌లకు ఖాళీలను వెల్లడిస్తారు. 26 నుంచి 28 వరకు ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పిస్తారు. 29 నుంచి 30 వరకు ఎస్‌జీటీల ఖాళీలను, అక్టోబరు 2న ఎస్‌జీటీల ఎడిట్ ఆప్షన్‌లు, 3న ఎస్‌జీటీ భాషా పండితులు, పీఈటీల బదిలీల ప్రక్రియను నిర్వహిస్తారు. అక్టోబరు 5 నుంచి 19 వరకు అప్పిల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.