నేటి నుంచి పదేళ్ల పండుగ ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-06-01T23:46:04+05:30 IST

సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, రోడ్లపై వంటావార్పు, ఉద్యోగుల నిరసనలు, సబ్బండ వర్గాలు రోడ్లపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షపై పోరాటం, నిరుద్యోగుల ఆత్మహత్యలతో వెరసి ఎన్నో పోరాటాల కల నెరవేరిన వేళ యావత్తు తెలంగాణం సంబురాలు చేసుకుంది.

నేటి నుంచి పదేళ్ల పండుగ ఉత్సవాలు
కలెక్టరేట్‌లో ఉత్సవాల ఏర్పాట్ల

- సర్వం సిద్ధం చేసిన అధికారులు

- వాడవాడలా జిల్లావ్యాప్తంగా ఉత్సవాల పండుగ

- కలెక్టరేట్‌ లో పతాకావిష్కరణతో ఉత్సవాలు ప్రారంభం

- సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై విస్తృత ప్రచారం

- ఉత్సవాలకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 1: సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, రోడ్లపై వంటావార్పు, ఉద్యోగుల నిరసనలు, సబ్బండ వర్గాలు రోడ్లపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షపై పోరాటం, నిరుద్యోగుల ఆత్మహత్యలతో వెరసి ఎన్నో పోరాటాల కల నెరవేరిన వేళ యావత్తు తెలంగాణం సంబురాలు చేసుకుంది. పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ పదేళ్ల ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ పదేళ్ల ప్రస్థానంలో స్వరాష్ట్రం ఎన్నో మైలురాళ్లను దాటింది. ఒక్కసారి వాటిని మననం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పదేళ్ల ఉత్సవాలను చూద్దాం.

నేటి నుంచి 22 రోజుల వరకు ఉత్సవాలు

తెలంగాణ ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా రాష్ట్రప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 22 వరకు నిర్వహించనుంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు లబ్ధిదారులు ఉత్సవాల్లో భాగస్వామ్యులను చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నేడు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలెక్టరేట్‌లో పతావిష్కరణ చేసి ఉత్సవాలను ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-06-01T23:46:04+05:30 IST