అత్యధిక సేల్స్‌ వైన్స్‌లే లక్ష్యం

ABN , First Publish Date - 2023-08-17T23:43:36+05:30 IST

జిల్లాలో ఈ సారి మద్యం దుకాణాలను ఎలాగైన దక్కించుకోవాలనే భావనలో కొందరు మద్యం వ్యాపారు లు, మరికొందరు ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 5 ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అత్యధికంగా మద్యం సేల్స్‌ అయి లాభాలు వచ్చే వైన్స్‌లనే టార్గెట్‌గా చేసుకుని దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి వైన్స్‌ల కు దరఖాస్తులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎన్నికల కారణంగా ఈసారి మద్యం దుకాణాలు దక్కించుకుంటే మంచి లాభాలే ఉంటాయని భావిస్తు మద్యం వ్యాపారు లు టెండర్లపై దృష్టి సారించారు. మద్యం వ్యాపారులంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఒక్కో వైన్స్‌పై 15కు పైగానే దరఖా స్తులు వేస్తున్నట్లు తెలిసింది.

అత్యధిక సేల్స్‌ వైన్స్‌లే లక్ష్యం
దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎక్సైజ్‌ సిబ్బంది

- వైన్స్‌లు దక్కించుకోవడమే టార్గెట్‌గా గ్రూపులు

- 10 నుంచి 20 మంది కలిసి టెండర్లు

- వైన్స్‌ల టెండర్లలోనూ సిండికేట్‌

- జిల్లాలో ఇప్పటి వరకు 1388 దరఖాస్తులు

- నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు

- చివరి రోజు అత్యధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం

- గత ఏడాదిని మించనున్న దరఖాస్తుల ఆదాయం

కామారెడ్డి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ సారి మద్యం దుకాణాలను ఎలాగైన దక్కించుకోవాలనే భావనలో కొందరు మద్యం వ్యాపారు లు, మరికొందరు ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 5 ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అత్యధికంగా మద్యం సేల్స్‌ అయి లాభాలు వచ్చే వైన్స్‌లనే టార్గెట్‌గా చేసుకుని దరఖాస్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి వైన్స్‌ల కు దరఖాస్తులు వేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఎన్నికల కారణంగా ఈసారి మద్యం దుకాణాలు దక్కించుకుంటే మంచి లాభాలే ఉంటాయని భావిస్తు మద్యం వ్యాపారు లు టెండర్లపై దృష్టి సారించారు. మద్యం వ్యాపారులంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఒక్కో వైన్స్‌పై 15కు పైగానే దరఖా స్తులు వేస్తున్నట్లు తెలిసింది. అయినప్పటికీ లక్కీడ్రా ద్వారా ఎవరికి దుకాణం దక్కుతుందో చూడాలి. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 1388 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి గతంతో పోలిస్తే 1500లకు పైగా దరఖాస్తులు చేయించడమే ఎక్సైజ్‌ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టార్గెట్‌ను రిచ్‌ అవుతారా లేదా అనేది చూడాలి నేటితో దరఖాస్తుల గడువు ముగియనుంది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.

సిండికేట్‌గా మద్యం వ్యాపారులు

జిల్లాలోని మద్యం దుకాణాలు దక్కించుకోవడమే లక్ష్యంగా కొంతమంది మద్యం వ్యాపారులు గ్రూప్‌లుగా ఏర్పడి ఎక్కువ దరఖాస్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రూప్‌లో 10 నుంచి 20 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. వీరు 3 నుంచి 5 మద్యం దుకాణా లకు టెండర్లు వేస్తున్నట్లు తెలిసింది. టెండర్‌ డబ్బులు నష్టపోకుండా సిండికేట్‌గా మారుతున్నారు. గ్రూప్‌లోని ఏ ఒక్కరికి దుకాణం వచ్చినా సభ్యులందరు వ్యాపారంలో భాగస్వా మ్యులు కావచ్చనే ఉద్దేశ్యంతో ఇలా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యో గులు సైతం వారి కుటుంబ సభ్యుల పేరిట దరఖాస్తులు వేసినట్లు తెలిసింది. మహిళలు సైతం దరఖాస్తులు చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా సేల్స్‌ ఉన్న 15 దుకా ణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా మద్యం సిండికేట్‌ వ్యాపారులు కన్నేసినట్లు తెలిసింది. పలుకుబడి ఉన్నకొంతమంది మద్యం వ్యాపారులు తాము ఎంచుకున్న దుకాణాలకు ఎవరు పోటీ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్నిచో ట్ల మద్యం విక్రయాలు బాగానే ఉన్నా దరఖాస్తులు తక్కు వ రావడంపై అనుమానాలకు తావిస్తోంది.

పెరిగిన పోటీ

ఈ సారి మద్యం దుకాణాలను దక్కించుకుంటే బాగా నే లాభాలు వస్తాయనే భావనలో మద్యం వ్యాపారులతో పాటు మరికొందరు ఆశావహులు ఉన్నారు. అయితే మద్యం దుకాణాలు దక్కించుకున్న వారందరికి అన్ని ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో మద్యం సేల్స్‌ భారీగానే జరిగి లాభాలు వస్తాయనే ఆలోచనలో ఉన్నారు. దీంతో మద్యం దుకాణాలను దక్కించుకునేం దుకు వ్యాపారులు ఆశావహులు భారీగానే దరఖాస్తులు వేస్తుండడంతో పోటీ పెరుగుతోంది. అందరూ ఊహించన ట్లుగానే జిల్లాలో 49 మద్యం దుకాణాలకు పోటీ పెరి గింది. 2021తో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య పెరగనుంది. దరఖాస్తులకు నేటితో చివరి గడువుకానున్న ందున మరింత దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఇప్ప టికే జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు 1388 దరఖాస్తు లు వచ్చాయి. గత ఏడాది జిల్లాలో 49 మద్యం దుకాణా లకు 984 దరఖాస్తులు రాగా రూ.18.80 కోట్ల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి చేకూ రింది. ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య ఆదాయం పెరగ నుంది. ఎక్సైజ్‌శాఖ ఈసారి మద్యం టెండర్లకు సుమారు 1500ల దరఖాస్తులు వచ్చేందుకు టార్గెట్‌గా పెట్టుకు న్నారు.

భారీగా దరఖాస్తులు

జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. గురువారం చివరి రెండో రోజు కావడంతో భారీగానే వచ్చాయి. గురువారం ఒకే రోజు 445 మద్యం దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1388 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌శాఖాధికారులు తెలిపారు. కామారెడ్డి ఎక్సైజ్‌ పరిధిలో 469, దోమకొండ సర్కిల్‌ పరిధిలో 273, ఎల్లారెడ్డి సర్కిల్‌ పరిధిలో 204. బాన్సువాడ సర్కిల్‌ పరిధిలో 220, బిచ్కుంద సర్కిల్‌ పరిధిలో 222 వచ్చాయి. శుక్రవారం మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు చివరి రోజు కానునందున పెద్ద మొత్తంలోనే దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జిల్లాలో 5 కేటగిరీలు

ప్రభుత్వం జనాభా ఆధారంగా మద్యం దుకాణాలపై ఎక్సైజ్‌పన్ను విధించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో రూ.85లక్షల వరకు అవకాశం ఉంది. 5 వేల జనాభా వరకు రూ.50లక్షలు, 5 నుంచి 50 వేల లోపు రూ.55 లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు 60లక్షలు, లక్ష నుంచి 5లక్షల వరకు రూ.65లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల జనాభా వరకు రూ.85లక్షల వరకు కేట గిరిలో ఐదు ఆప్షన్‌లు ఉన్నాయి. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ప్రభుత్వానికి ముందస్తుగా ఎక్సైజ్‌ పన్నుల్లో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. మిగితా సొమ్ము రెండు నెలల కిస్తీల ప్రకారం, రెండేళ్ల కాలంలో 12 వాయిదాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లాలో 5 వేల జనాభా నుంచి లక్షల వరకు జనాభా ఉన్న రూ.85 లక్షల నుంచి 65 లక్షల వరకు ఉన్నాయి.

Updated Date - 2023-08-17T23:43:36+05:30 IST