జిల్లాలో క్రీడా మైదానాలు కరువు
ABN , First Publish Date - 2023-08-18T00:38:49+05:30 IST
జిల్లాలో క్రీడామైదానాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిధులు కేటాయించినా ఫలితం లేకుండా పోతోంది.
బోర్డుల ఏర్పాటుకే పరిమితమైన అధికారులు
మైదానాలు లేక క్రీడాకారులకు తప్పని ఇక్కట్లు
జిల్లాలో కొన్నిచోట్ల ఇంకా మొదలు కాని పనులు
సుభాష్‌నగర్, ఆగస్టు 17: జిల్లాలో క్రీడామైదానాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిధులు కేటాయించినా ఫలితం లేకుండా పోతోంది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలో చాలచోట్ల ఇప్పటికీ క్రీడా మైదానాల ఏర్పాటు ప్రక్రియ తూతూ మంత్రంగానే సాగు తోంది. మొదట్లో హడావిడి చేసిన అధికారులు ఆ తార్వాత వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి ప్రతిచోట కేవలం క్రీడా మైదానాల బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా కొన్ని చోట్ల స్థలా లు కూడా గుర్తించలేదు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయగా మొదట్లో పనులు సాఫీ గా జరిగినా తర్వాత వాటిని గాలికొదిలేశారు. జిల్లాలో 530గ్రామాలు 130ఆవస గ్రామాల్లో సుమారు 660 క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్ప టికీ అందులో కేవలం 440 మాత్రమే మైదా నాలను గుర్తించి బోర్డులను ఏర్పాటు చేశారు. ఒక్కో క్రీడా మైదానం కోసం రూ.3లక్షల నిధులు కేటాయించారు.
వృథాగా మైదానాలు
ఒక్కొక్క మైదానానికి రూ.3 లక్షలు వెచ్చించి క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. ఇందులో 440 క్రీడా మైదానాలు నిర్మాణం పూర్తవగా వీటిలో చాల వరకు అసంపూర్తిగా పనులు జరగి మైదానాలు వినియోగంలోకి రాలేవు. కేవలం మొరంపోసి చదును చేసి వదిలేశారు. చాల వరకు మైదానాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు ఏర్ప డ్డాయి. దాంతోపాటు నాసిరకంగా ఏర్పాటు చేయడం వల్ల క్రీడాకారులకు ఉపయోగంలోకి రాకుండా పోయాయి. ప్రతి గ్రామం, మండలాల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా చాలచోట్ల క్రీడాకారులు ప్రైవేటు స్థలాల్లో ఆడుకుం టున్నారు. మరికొందరు ప్రైవేటు పాఠశాలల్లో క్రీడా శిక్షణ పొందుతున్నారు. అనేకచోట్ల సరైన స్థలాలు లేకపో వడంతో అధికారులు ఇరుకైన స్థలాల్లో మైదానాలను ఏర్పాటు చేశారు.
బోర్డులకే పరిమితం
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మైదా నాలు బోర్డులకే పరిమితమయ్యాయి. జిల్లాలో చాలచోట్ల బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో మాత్రం స్థలాలు ఉండే చోట్ల బోర్డులు పెట్టారు. వీటిలో ఎలాంటి క్రీడలు ఆడుకోవ డానికి అనువుగా లేవు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన మైదానాలు సరైన స్థలాలు గుర్తించకపోవడంతో మై దానాల పరిస్థితి దయనీయంగా మారింది. చాలచోట్ల కొందరు క్రీడా మైదానాల ఏర్పాటు పేరిట డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బోర్డులకే పరిమితమైన మైదానాలు
: విపుల్‌రావ్, క్రీడాకారుడు, లక్కంపల్లి
జిల్లాలో ఎక్కడ చూసిన క్రీడామైదానాలు బోర్డులకే పరిమితమయ్యాయి. చిన్నపాటి మైదానాన్ని తీసుకుని బోర్డు పెట్టి ప్రభుత్వ అధికారులు చేతులు దులుపు కున్నారు. మైదానాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తిం చి విశాలమైన క్రీడామైదానాలను ఏర్పాటు చేయాలి.
స్థలాలు లేకపోవడం వల్లే ఇరుకైన మైదానాలు
:చందర్ రాథోడ్, (పీడీ, డీఆర్‌డీఏ)
చాల గ్రామాల్లో విశాలమైన క్రీడామైదానాల ను ఏర్పాటు చేశాం. కొన్ని చోట్ల మాత్రమే ఒక్కొక్క క్రీడకు మైదానాలను ఏర్పాటు చే శాం. ప్రభుత్వ స్థలాలు లేకపోవడం వల్లే ఇరుకైన క్రీడామైదానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా గ్రామా ల్లో క్రీడాకారులకు అనుగుణంగా మైదానాలను ఏర్పాటు చేసేందుకు ప్రయ త్నాలు చేస్తున్నాం.