ఎస్సారెస్పీని సందర్శించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-09-04T01:17:59+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరిన గోదావరి వరద జలాల తో శ్రీరాంసాగర్‌ప్రాజెక్టులోని నీరు రంగుమారి కలు షితం అయిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యం లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును సంద ర్శించి ప్రాజెక్టు నీటిని పరిశీలించారు.

ఎస్సారెస్పీని సందర్శించిన కలెక్టర్‌

ముప్కాల్‌/మెండోర, సెప్టెంబరు 3: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరిన గోదావరి వరద జలాల తో శ్రీరాంసాగర్‌ప్రాజెక్టులోని నీరు రంగుమారి కలు షితం అయిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యం లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్‌ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును సంద ర్శించి ప్రాజెక్టు నీటిని పరిశీలించారు. డ్యాం సైట్‌ పైనే సంబంధిత శాఖల అధికారులతో తాజా పరిస్థితి గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు. రిజర్వా యర్‌లోని నీరు పచ్చరంగులో మారిన ప్పటికీ ఎలాంటి హానికరమైన వ్యర్థాలు కలలేదని, ప్రాజెక్టు జలాలు కలుషితం కాలేదని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మిషన్‌ భగీరథ కింద తాగునీటి కోసం వినియోగించే సుమారు 10ఇంటెక్‌ వెల్‌ పాయింట్ల వద్ద నుంచి గోదావరి జలాల శాంపిల్స్‌ సేకరించి అవసరమైన పరీక్షలు నిర్వహించగా వినియోగానికి అనువైనవిగా ఉన్నట్టు నిర్ధా రణ అయిందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ.. ఎస్సారెస్సీ నీటి స్వచ్ఛతపై విషయమై పలు పత్రికల్లో వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని సమీక్షిం చడం జరిగిందన్నా రు. ఆయకట్టు రైతులు, ప్రజల నుంచి ఎస్సారెస్పీ నీటి విషయంలో ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఎక్కడ కూడా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని తెలిపారు. నీరు కలుషితం కావడంలేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికా రులు నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైం దని అన్నారు. కలెక్టర్‌ వెంట ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్‌, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.

ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

ఆర్మూర్‌రూరల్‌, సెప్టెంబరు 3: ఓటరు జాబితాలోని ప్రతీఓటరు వివరాలను ఇంటింటికీ తిరిగి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని బీఎల్‌వోలకు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. ఆదివారం ఆర్మూర్‌ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను ఆర్డీవో వినోద్‌కుమార్‌తో కలిసి కలెక్టర్‌ సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు సంబంధిత ప్రాంతంలోని ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదు, జాబితా నుంచి పేర్ల తొలగింపు, మార్పులు, చేర్పుల కోసం పాటిస్తున్న పద్ధతులను అడిగితెలుసుకున్నారు. సంబంధిత రికార్డులను కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఆర్‌ఐ అశోక్‌సింగ్‌, బూత్‌లెవల్‌ సూపర్‌వైజర్‌లు అరుణ, బీఎల్‌ వోలు రాజ్యలక్ష్మీ, పద్మ, లక్ష్మీ, సవతిరాణి, లహరి, అన్నపూర్ణ, షబానా, వాణి, శోభరాణి, సంబంధిత అధికారులు ఉన్నారు.

తుది జాబితాలో తప్పులు ఉండొద్దు..

ముప్కాల్‌, సెప్టెంబరు 3: తుది ఓటరు జాబితలో ఎలాంటి తప్పిదా లకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. డబుల్‌ ఎంట్రీలు, బోగస్‌పేర్లు లేకుండా జాబితాలను బీఎల్‌వోల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌లకు సూచించారు. ఎన్నికల సన్నద్దంలో భాగంగా ఆదివారం బాల్కొండ మండలంలోని శ్రీరాంపూర్‌ పోలింగ్‌ బూత్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 18 ఏళ్లునిండిన ప్రతీఒక్కరిని ఓటరుగా తప్పకుండా జాబితాలో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ వేన్ను వినోద్‌, నయాబ్‌ తహసీల్దార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T01:17:59+05:30 IST