Revanth Reddy: ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానం: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-04-10T18:27:20+05:30 IST

సీఎం కేసీఆర్‌ (CM KCR)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim)లకు సమానమని

Revanth Reddy: ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలకు సమానం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR)పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ధ్వజమెత్తారు. ఒక్క కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim)లకు సమానమని దుయ్యబట్టారు. కేసీఆర్ భూదోపిడీపై సీబీఐ (CBI)కి లేఖ రాస్తానని ప్రకటించారు. కేసీఆర్ గజ దొంగ.. ఆయనతో కాంగ్రెస్ కలువదని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల కూటమికి నాయకత్వం కోసం.. కేసీఆర్ ఆసక్తిగా ఉన్నట్లు జర్నలిస్ట్ రాజ్దీప్ చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ మోడల్ అత్యంత ప్రమాదకరమైందని తప్పుబట్టారు. కేసీఆర్ దగ్గర లక్ష కోట్ల అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. భూములను వనరుగా పెట్టుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారని, ఉపఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏపీ ఎన్నికలకూ కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

కర్నాటక (Karnataka)లో జేడీఎస్ ద్వారా తన అస్తిత్వాన్ని కాపాడుకునే యత్నం చేస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాలను కేసీఆర్ శాసించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని, కర్ణాటక ఎన్నికల కోసం మాజీసీఎం కుమారస్వామి (Kumaraswamy)కి వందల కోట్లు ఇస్తున్నారని తెలిపారు. విపక్షాలకు ఇచ్చేందుకు కేసీఆర్కు అంత డబ్బు ఎక్కడిది? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ భూదోపిడీకి పాల్పడ్డారని, తనతో ఉన్న వారందరికీ కేసీఆర్ భూములు పంచుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

‘‘హెటిరో పార్థసారథి కేసీఆర్ అనుచరుడు. పార్థసారథి సీబీఐ, ఈడీ దాడులు ఎదుర్కొన్నాడు. ఐటీ దాడుల్లో రూ.142 కోట్లు దొరికాయి. ఆర్థిక నేరగాడు పార్థసారథిరెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చారు. సాయిసింధు పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. 15 ఎకరాల భూమి కావాలని కేసీఆర్కు దరఖాస్తు చేశారు. అతి తక్కువ రేటుకే భూములు కట్టబెట్టారు. కేసీఆర్ భూదోపిడీని ధారావాహికగా బయట పెడతా. రేపు యశోద హాస్పిటల్స్కు భూకేటాయింపులపై.. దోపిడీ కోణం బయట పెడతా. రెమీడెసీవర్ను బ్లాక్లో అమ్ముకున్నారు’’ అని రేవంత్రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2023-04-10T18:27:20+05:30 IST