బషీరాబాద్‌లో దారుణం.. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి...

ABN , First Publish Date - 2023-07-19T11:15:24+05:30 IST

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బషీరాబాద్ కు చెందిన నగేష్ అనే వ్యక్తిని ఓ ఫిర్యాదు విషయమై పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు రప్పించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిట్స్ రావడంతో స్పృహ కోల్పోయి కుప్పకూలి నగేష్ కింద పడిపోయాడని.. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

బషీరాబాద్‌లో దారుణం.. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి...

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బషీరాబాద్ కు చెందిన నగేష్ అనే వ్యక్తిని ఓ ఫిర్యాదు విషయమై పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు రప్పించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిట్స్ రావడంతో స్పృహ కోల్పోయి కుప్పకూలి నగేష్ కింద పడిపోయాడని.. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్దకు చేరుకుని.. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియాలో చేర్పించారు. పోలీసులు కొట్టడం వల్లే నగేష్ పరిస్థితి విషమంగా మారిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-07-19T11:15:24+05:30 IST