Chikoti Praveen : బోనాలకు వచ్చిన చికోటి ప్రవీణ్‌ను చూసి అవాక్కైన పోలీసులు.. అసలేం జరిగిందంటే..?
ABN , First Publish Date - 2023-07-16T15:42:32+05:30 IST
భాగ్యనగరం (Hyderabad) బోనమెత్తింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో (Lal Darwaza Bonalu) అట్టహాసంగా బోనాల పండగ (Bonala Pandaga) జరుగుతోంది. భక్తులతో అమ్మవారి దగ్గర బోనాల సందడి నెలకొంది. ఇంతలో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడు. ఆయనతో పాటు అనుచరులు కూడా వచ్చారు..
భాగ్యనగరం (Hyderabad) బోనమెత్తింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో (Lal Darwaza Bonalu) అట్టహాసంగా బోనాల పండగ (Bonala Pandaga) జరుగుతోంది. భక్తులతో అమ్మవారి దగ్గర బోనాల సందడి నెలకొంది. ఇంతలో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాడు. ఆయనతో పాటు అనుచరులు కూడా వచ్చారు. ఇంతవరకూ బాగానే ఉందిగానీ ప్రైవేట్ సెక్యూరిటితో (Private Security) గుడి దగ్గరికి రావడంతో చికోటికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు అడ్డుకున్నారు. అయితే.. సిబ్బందిలోని ముగ్గురి దగ్గర వెపన్స్ ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఆ ముగ్గురినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆ ముగ్గుర్నీ పోలీసులు విచారిస్తున్నట్లు తెలియవచ్చింది. లైసెన్స్ లేకపోతే కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్ భద్రత కోసం చేసిన వినతిని పరిగణలోకి తీసుకోవాలని హైదరాబాద్ సీపీని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్ దరఖాస్తును వారంలోగా పరిగణలోకి తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు స్పష్టం చేసింది. తనకు ప్రాణ హాని ఉందని, కొందరు రెక్కీకి పాల్పడుతున్నారంటూ చికోటి పలుమార్లు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనను భౌతికంగా లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించాడు. క్యాసినో వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారణను చికోటి ఎదుర్కొంటున్నాడు.