Governor Vs CM: వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం..! రాజ్‌భవన్‌కు మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-01-30T20:28:42+05:30 IST
ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డి (Harish Rao Prashanth Reddy) రాజ్‌భవన్ మెట్లెక్కారు. ఈ రోజు సాయంత్రం గవర్నర్ తమిళిసై..
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌లో గవర్నర్ ప్రసంగంపై సస్పెన్స్‌కు తెరపడింది. ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు (Harish Rao, Prashanth Reddy) రాజ్‌భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. ఉభయ సభల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్‌ను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడ్జెట్ (Budget) సమావేశాల దృష్ట్యా గవర్నర్కు స్పీచ్ కాపీని మంత్రి అందజేశారు. కాగా పెండింగ్ బిల్లుపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా రాజ్‌భవన్ (Raj Bhavan), ప్రగతిభవన్ మధ్య దూరం పెరుగుతూ వస్తున్న క్రమంలో ఇలాంటి పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా గతంలో రెండుసార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని అనుకున్న ప్రభుత్వం మనసు మార్చుకుని.. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రకటించింది. తదనుగుణంగానే గవర్నర్‌ను మంత్రి ఆహ్వానించారు.
వాస్తానికి ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపాల్సి ఉన్నందున అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే గవర్నర్ తమిళిసై మాత్రం అనుమతి తెలపలేదు. రాజ్‌భవన్ (Raj Bhavan) నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో సోమవారం హైకోర్టు (High Court)లో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను రంగంలోకి దించింది. ప్రజాపద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరలనుకున్నారు. కానీ ఉన్నట్లుండి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ (Lunch Motion Petition) ప్రభుత్వం ఉపసంహరించుకుంది.