KTR: కేటీఆర్‌కు నిరసన సెగ

ABN , First Publish Date - 2023-03-27T20:48:28+05:30 IST

గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ (ABVP) నాయకులు మంత్రి కేటీఆర్‌ (KTR) కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా

KTR: కేటీఆర్‌కు నిరసన సెగ

సిరిసిల్ల: గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ (ABVP) నాయకులు మంత్రి కేటీఆర్‌ (KTR) కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సిరిసిల్ల జిల్లా (Sirisilla District) కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ వాహనాన్ని సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఒక్కసారిగా అడ్డుకోగా పోలీసులు బలవంతంగా పక్కకు లాగేసి పోలీస్‌ స్టేషన్‌ (Police station)కు తరలించారు. మంత్రి పర్యటన ముగిసే వరకు పోలీసుల అదుపులోనే ఉంచుకున్నారు. మంత్రి కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ నలుగురు పొరగాండ్లను రెచ్చగొట్టడం కాదు, జిల్లాకు ఏమి చేశారో... విద్యారంగంలో ఏం తీసుకొచ్చారో అడిగి ఎంపీ బండి సంజయ్‌, ప్రధాని మోదీని అడ్డుకోవాలని, నిలదీయాలని అన్నారు.

బలగం డైరెక్టర్‌కు సన్మానం

బలగం సినిమా డైరెక్టర్‌ సిరిసిల్లకు చెందిన యెల్దండి వేణును సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంత్రి కేటీఆర్‌ సన్మానించారు.అద్భుతమైన సినిమా తీశావని తాను కూడా చూశానని అభినందించారు. అప్పుడే కమర్షియల్‌ చిత్రాల వైపు వెళ్లకుండా ప్రజల వైపు తెలంగాణ సంస్కృతీసంప్రాదాయాల వైపు సినిమాలు నిర్మించాలని సూచించారు.

నవీన్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

సిరిసిల్లలో ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన నిరుద్యోగి నవీన్‌కుటుంబాన్ని మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-03-27T20:48:28+05:30 IST