Prajadarbar: రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్‌కు అధికారుల డుమ్మా
ABN , First Publish Date - 2023-01-01T14:14:59+05:30 IST
రాజ్‌భవన్ (Raj Bhavan), ప్రగతిభవన్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ (Prajadarbar)కు అధికారుల డుమ్మా కొట్టారు. న్యూఇయర్ వేళ రాజ్‌భవన్‌లో మంత్రులు..
హైదరాబాద్: రాజ్‌భవన్ (Raj Bhavan), ప్రగతిభవన్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ (Prajadarbar)కు అధికారుల డుమ్మా కొట్టారు. న్యూఇయర్ వేళ రాజ్‌భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించ లేదు. న్యూఇయర్ రోజు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున గవర్నర్‌కు విషెస్ తెలిపే సంప్రదాయానికి బ్రేక్ వేశారు. రాష్ట్రంలో కేంద్ర సహకారం వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందని గవర్నర్ తమిళిసై తెలిపారు. కేంద్రం సకాలంలో టీకాలు ఇవ్వడంవల్లే కరోనా కట్టడి అయిందని, కరోనా కట్టడిలో టీఎస్ సర్కార్ చేసిన అంశాలను గవర్నర్ ప్రస్తావించారు.
ఇటీవల రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై (Tamilisai) విందు ఇచ్చారు. అయితే గవర్నర్ విందుకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. గవర్నర్ విందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, మల్లారెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టు (Hakimpet Airport)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం కేసీఆర్ (CM KCR) స్వాగతం పలికారు. కేసీఆర్‌తో పాటు రాష్ట్రపతి ముర్ముకు ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, బాలరాజ్, హర్షవర్దన్‌రెడ్డి స్వాగతం పలికారు. హకీంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వెళ్లిన సమయంలో గవర్నర్‌తో కేసీఆర్ మాట్లాడారు. ఇద్దరు మాట్లాడుకోవడంతో ఇక నుంచి ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య గ్యాప్ తొలగిపోయినట్లేనని అందరూ అనుకున్నారు. కానీ.. షెడ్యూల్‌లో లేదనే కారణంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ విందుకు సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం గవర్నర్‌తో ఆ గ్యాప్ కొనసాగుతుందనే సంకేతాలకు కారణమైంది.