Rangareddy Dist.: మైలార్‌దేవ్‌పల్లి టాటా నగర్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2023-08-20T10:01:35+05:30 IST

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరుపుల బెడ్ తయారు చేసే కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.

Rangareddy Dist.: మైలార్‌దేవ్‌పల్లి టాటా నగర్‌లో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరుపుల బెడ్ తయారు చేసే కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫాహిం అనే వ్యక్తికి చెందిన పరుపుల గోదాంలో మంటలు చెలరేగగా సుమారు రూ. 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

గోదాం లోపల నుంచి దట్టంగా వెలువడుతున్న పొగ.. ఎగిసి పడిన మంటలతో స్థానికులు భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. కాటన్ కావడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. గోదాంలో పని చేస్తున్న పది మంది కార్మికులు సురక్షితంగా బయట పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-08-20T10:01:35+05:30 IST