Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం..

ABN , First Publish Date - 2023-04-26T14:41:30+05:30 IST

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం రేగింది. గుప్త నిధులు (Hidden funds) ఉన్నాయన్న అనుమానంతో సొరంగం (Tunnel)లోకి యువకులు వెళ్లారు.

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం..

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం రేగింది. గుప్త నిధులు (Hidden funds) ఉన్నాయన్న అనుమానంతో సొరంగం (Tunnel)లోకి యువకులు వెళ్లారు. అయితే వారికి పెద్ద నాగు పాము (Snake) ప్రత్యక్షం కావడంతో భయంతో యువకులు బయటకు పరుగులు తీశారు. ప్రాణాలతో బయట పడ్డారు. సొరంగం నుంచి పది అడుగుల నాగు పాము బయటకు వచ్చింది.

అత్తాపూర్ వద్ద పురాతన కట్టడమైన ముశక్ మహల్‌ (Mushk Mahal)లో సొరంగం ఉన్నట్లు యువకులు కనుగొన్నారు. ఫోటో షూట్ (Photo Shoot) కోసం ముశక్ మహల్‌కు యువకులు వెళ్లారు. అక్కడ ఇంతవరకు ఎవ్వరూ చూడని సొరంగం చూశారు. ఆ సొరంగం దారి ఎక్కడికి వెళుతుంది?.. అందులో ఏముంది?.. అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నాగు పాము బయటకు రావడంతో పక్కాగా గుప్త నిధులు ఉండవచ్చునని స్థానికులు అంటున్నారు.

Updated Date - 2023-04-26T14:41:30+05:30 IST