Vikarabad Car racing: అనంతగిరి అడవుల్లోకి ఎలా వచ్చారు? దర్యాప్తు ముమ్మరం
ABN , First Publish Date - 2023-08-17T11:48:51+05:30 IST
ఆగస్టు 15 కావడంతో పోలీసులు, ఫారెస్ట్, మిగతా అధికారులంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా భావించారో ఏమో తెలియదు గానీ.. కార్లు, బైకులతో యువత అనంతగిరి అడవుల్లోకి ప్రవేశించి రేసింగ్‌లతో అలజడి సృష్టించారు.
వికారాబాద్: వికారాబాద్ అనంతగిరి అడవుల్లో (Vikarabad Car racing) జరిగిన కార్, బైక్ రేసింగ్‌లపై పోలీసులు, ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజున 40 మందితో 16 కార్లు, 30 బైక్‌లతో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అసలు అడవుల్లోకి ఎవరు అనుమతించారన్నదానిపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సీసీటీవీ కెమెరాల ఆధారంగా పలు కార్లను, బైక్‌లను అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు వచ్చి ఈ రేసింగ్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కార్ రేసింగ్ జరిపిన ప్రాంతాన్ని విజిలెన్స్ అధికారి రమణా రెడ్డి, వికారాబాద్ డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ పరీశీలించారు.
ఆగస్టు 15 కావడంతో పోలీసులు, ఫారెస్ట్, మిగతా అధికారులంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఇదే అదునుగా భావించారో ఏమో తెలియదు గానీ.. కార్లు, బైకులతో యువత అనంతగిరి అడవుల్లోకి ప్రవేశించి రేసింగ్‌లతో అలజడి సృష్టించారు. అనంతరం ఈ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు.