Vikarabad Dist.: భూ సెటిల్ మెంట్ ఆరోపణలపై స్పందించిన పరిగి ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-04-11T10:54:38+05:30 IST

వికారాబాద్ జిల్లా: భూ సెటిల్ మెంట్ (Land settlement) ఆరోపణలపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి (MLA Mahesh Reddy) స్పందించారు.

Vikarabad Dist.: భూ సెటిల్ మెంట్ ఆరోపణలపై స్పందించిన పరిగి ఎమ్మెల్యే

వికారాబాద్ జిల్లా: భూ సెటిల్ మెంట్ (Land settlement) ఆరోపణలపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి (MLA Mahesh Reddy) స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదన్నారు. పంచాయతీ తన వద్దకు వచ్చింది వాస్తవమేనని ఎమ్మెల్యే అన్నారు. రాజీ కుదుర్చుకోమని చెప్పానని, తాను ఎలాంటి సెటిల్ మెంట్ చేయలేదని పేర్కొన్నారు. నవీన్ (Naveen) అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని.. ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదన్నారు. కొందరు తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న విడియో గురించి తనకు తెలియదని.. ఇప్పుడే చూస్తున్నానన్నారు. వివరాలు కావాలంటే వెళ్ళి ఓనర్‌ను.. బాధితులను అడగాలని.. ఈ సెటిల్ మెంట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

కాగా పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అనుచరుల భూకబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. పూడూరు మండలం, చన్‌గోముల్‌లోని సర్వే నెం.346లో.. శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి నవీన్‌ 4 ఎకరాల భూమి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ భూమిలో ఫెన్సింగ్ వేస్తుండగా కర్రలు, రాడ్లతో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి.. ట్రాక్టర్‌తో ఫెన్సింగ్‌ కడీలను పగులగొట్టారు. బాధితుల బైక్‌ తగులబెట్టి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యే ఒత్తిడితో ఫిర్యాదును పట్టించుకోలేదు. తన అనుచరుల నుంచి ఎంతోకొంత తీసుకుని.. భూమి వదిలేయాలని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి హుకుం జారీచేసినట్లు సమాచారం. భూ కబ్జాకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Updated Date - 2023-04-11T10:54:38+05:30 IST