TS News: ఆన్‌లైన్‌లో బెట్టింగ్.. పోలీసుల సడన్ ఎంట్రీ... పట్టుబడ్డ వారంతా..
ABN , First Publish Date - 2023-02-16T10:07:25+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ గుర్రపు స్వారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ గుర్రపు స్వారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. తేజస్వీనగర్ కాలనీలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసుల బృందం.... ఆన్‌లైన్ (Online) లో గుర్రపు స్వారీ బెట్టింగ్ (Betting)నిర్వహిస్తుండగా 13 మందిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. వారివద్ద నుంచి రూ.51 వేల నగదు, 17 మొబైల్ ఫోన్లు (Moblies), 19 డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, హార్స్ రేసింగ్ గైడ్ బుక్‌తో పాటు ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తేజస్వీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసిన కేటుగాళ్లను ఎంతో చాకచక్యంగా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిర్వాహకుడు తిరుమల్ రెడ్డి వాట్స్ఆప్ గ్రూప్ (Whatsapp Group) క్రియేట్ చేసి అందులో గుర్రపు స్వారీ సమాచారం పోస్టుచేస్తున్నాడు. ఆర్‌ఎస్ వరల్డ్ అనే గ్రూప్ ద్వారా తిరుమల్ రెడ్డి గుర్రపు స్వారీ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. పట్టుబడ్డ వారు అందరూ బాడా వ్యాపారస్తులుగా గుర్తించారు. గత సంవత్సరం నుండి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడ్డ 13 మందిపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.