Home » Rajendranagar
ఎవరైనా కోడిపుంజు కోసం వేలకు వేలు పెడతారా? ఒక్క పుంజు కోసం మరీ రూ.20వేలు వెచ్చించి కొంటారా? కొనేందుకు పోటీపడ్డారు.. కొన్నారు. ఇలా మొత్తంగా 81 కోళ్లకు వేలం పాట నిర్వహిస్తే ఏకంగా రూ.16.65 లక్షలొచ్చాయి.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఉన్నతాధికారులను ఆదేశించారు.
‘‘శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చాం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి కూడా అనేక హామీలు ఇచ్చారు.
Telangana: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో చిరుత కదలికలు కనిపించాయి. చిరుత కనపడటంతో మార్నింగ్ వాకర్ష్, స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం తన పుట్టినిల్లు వంటిదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి(Former Minister, Maheshwaram MLA P. Sabitha Indra Reddy) అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది.
మహిళల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి స్వయం సహాయక సంఘాల మహిళలు బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు.
హైదరాబాద్లోని పురాతనమైన బంరుకున్దౌల చెరువులోని ఆక్రమణలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఉక్కుపాదం మోపింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) దూసుకెళ్తోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస జోరు కొనసాగుతుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్.. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ చేరనున్నారు. ఆయనతోపాటు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.