Sad incident: రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోన్న పరువు హత్య
ABN , First Publish Date - 2023-09-19T20:53:54+05:30 IST
రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో దారుణం జరిగింది. జిల్లాలోని కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య(Sad incident) జరిగింది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో దారుణం జరిగింది. జిల్లాలోని కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య(Sad incident) జరిగింది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో కరణ్ అనే యువకుడిని యువతి తండ్రి రంజిత్ పాశ్వాన్, అతని బంధువులు కొట్టి చంపారు. కుమారై వరసయ్యే యువతిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతోనే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. కరణ్‌ను చంపి పొలంలో రంజిత్ పాశ్వాన్ పాతిపెట్టారు. కరణ్ సోదరుడి ఫిర్యాదుతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. బీహార్ నుంచి వచ్చిన రంజిత్, కరణ్ కుటుంబాలు షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రంజిత్ కూతురిని కరణ్ ప్రేమించి పెళ్లిచేసుకోవడాన్ని తట్టుకోలేకపోయాడు. దీంతో పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.