Tenth Paper Leak: తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది...

ABN , First Publish Date - 2023-04-03T14:37:46+05:30 IST

పదో తరగతి పరీక్ష ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ అవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Tenth Paper Leak: తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్‌ చేసింది ఎవరో తెలిసిపోయింది...

వికారాబాద్: పదో తరగతి పరీక్షలు (Tenth Exam) ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ అవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూర్‌‌ (Tandur)లో పరీక్ష మొదలైన ఏడు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సప్‌ గ్రూప్‌లలో చెక్కర్లు కొట్టింది. తాండూర్ మండల కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ విషయం తెలిసిన వెంటనే పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తాండూరు ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్లో పేపర్ లీకేజ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్‌కు చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్ప ఫోన్ నుంచి వాట్సప్‌లో షేర్ అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఉపాధ్యాయుడు బందెప్ప పోలీసుల అదుపులో ఉన్నారు. పేపర్ లీకేజ్‌పై బందెప్పను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే మొదట పేపర్ లీక్ కాలేదంటూ విద్యాశాఖ అధికారులు చెప్పుకొచ్చారు. పేపర్ లీకేజ్ వార్తలను పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ఇదే విషయంపై కలెక్టర్ నారాయణ రెడ్డితో డీఈవో రేణుకా దేవి సమావేశమయ్యారు.

Updated Date - 2023-04-03T14:48:04+05:30 IST