TS News: కుంటలోకి దూసుకెళ్లిన న్యూబ్రిలియంట్ స్కూల్ బస్

ABN , First Publish Date - 2023-09-23T09:36:36+05:30 IST

జిల్లాలో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

TS News: కుంటలోకి దూసుకెళ్లిన న్యూబ్రిలియంట్ స్కూల్ బస్

వికారాబాద్: జిల్లాలో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్కూల్ బస్సు అదుపుతప్పి సుల్తాన్‌పూర్ కుంటలోకి దూసుకెళ్ళింది. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన బస్సులోని విద్యార్థులు రక్షించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు మరికొంత లోపలికి వెళ్తే పెను విషాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే స్టీరింగ్ పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు. దీంతో పాఠశాల యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు ఫిట్నెస్ లేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-09-23T09:36:41+05:30 IST