Revanth Reddy: రేణుకా చౌదరితో రేవంత్‌ భేటీ

ABN , First Publish Date - 2023-04-20T21:40:19+05:30 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka Chaudhary) నివాసంలో సమావేశమయ్యారు.

Revanth Reddy: రేణుకా చౌదరితో రేవంత్‌ భేటీ

ఖమ్మం: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (Renuka Chaudhary) నివాసంలో సమావేశమయ్యారు. ఈనెల 24న ఖమ్మంలో ఏర్పాటుచేసిన నిరుద్యోగ నిరసన ర్యాలీపై చర్చించారు. ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీ తేదీ ఖరారు విషయంలో రేణుకాచౌదరికి ముందుగా చెప్పకపోవడంతో రేవంత్‌రెడ్డి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి నిరుద్యోగ ర్యాలీ నిర్వహణ, విజయవంతంపై గురించి మాట్లాడారు. అయితే తనకు 24న వ్యక్తిగత పని ఉన్నందున ర్యాలీకి హాజరుకావడం సాధ్యపడదని, ఖమ్మం జిల్లా (Khammam District)లోని నాయకులందరికి తాను స్వయంగా ఫోన్‌చేసి నిరుద్యోగ నిరసన ర్యాలీని జయపద్రం చేయాలని కోరతానని రేణుకాచౌదరి రేవంత్‌కు చెప్పినట్టు సమాచారం. రేణుకాచౌదరితో సమావేశమైన వారిలో రేవంత్‌రెడ్డితో పాటు మాజీమంత్రి షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు బలరాంనాయక్‌, రాజయ్య, మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్‌రెడ్డితోపాటు పలువురు నేతలున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తన వర్గీయులందరికీ నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని రేణుక సూచించారు.

Updated Date - 2023-04-20T21:40:19+05:30 IST