Home » AP Congress
YS Sharmila: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చురకలు అంటించారు. జగన్ను వీసా రెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్ను వదిలి బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.
YS Sharmila: పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, వారి రాజ్యాంగం వల్ల ప్రజా స్వామ్యం కాపాడపడుతోందని తెలిపారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు.
అదానీపై అమెరికాలో కేసు నమోదు చేసిన భారతదేశంలో ఆయనపై ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు లంచాలు ఇచ్చిందని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
వైసీపీ అధినేత జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బడ్జెట్ సమావేశానికి కూడా జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత జగన్కు లేదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని షర్మిల కోరారు.
వైసీపీపై ప్రజలకు నమ్మకం పోయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు.
అన్ని మతాలను పవన్ కళ్యాణ్ సమానంగా చూడాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. ఒక మతానికే ప్రతినిధిగా పవన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వేషం వేసుకుని హిందూ మతం గురించి మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చర్యల వల్ల ఇతర మతాలను ఆచరించే వారిలో అభద్రతా భావం ఏర్పడదా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారని షర్మిల విమర్శలు చేశారు.
మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కార్కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekar Reddy) వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు.
వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ని అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హింసించి హత్య చేశారని ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ (Sailajanath) అన్నారు. డాక్టర్ హత్యని నార్మల్ సంఘటనలా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు.
విత్తనాల కోసం రైతులు తిప్పలు పడుతున్నారని.. క్యూలైన్లు కడుతుంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేకుండా ఉందని విమర్శించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా ? అని నిలదీశారు.