BSP: ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ సీఎం అవుతారు: మాయావతి
ABN , First Publish Date - 2023-05-07T21:28:54+05:30 IST
తెలంగాణ బీఎస్పీ (BSP) అధికారంలోకి వస్తే ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ (RS Praveen Kumar) సీఎం అవుతారని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayawathi) ప్రకటించారు. సరూర్నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’లో మాయావతి మాట్లాడుతూ..
హైదరాబాద్: తెలంగాణ బీఎస్పీ (BSP) అధికారంలోకి వస్తే ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ (RS Praveen Kumar) సీఎం అవుతారని ఆ పార్టీ అధినేత్రి మాయావతి (Mayavati) ప్రకటించారు. సరూర్నగర్ స్టేడియంలో ‘తెలంగాణ భరోసా సభ’లో మాయావతి మాట్లాడుతూ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినన్ని రోజులు యూపీలో బీఎస్పీ గెలిచిందని తెలిపారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు మొదలైనప్పటి నుంచి బీజేపీ గెలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) తమ పాలనను కాపీ కొట్టాలని చూశారని, తాము చేసినట్లు 3 ఎకరాల భూమి ఇవ్వలేక పోయారని విమర్శించారు. కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తా అన్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను ఎన్నికల్లో గెలవనివ్వలేదని గుర్తుచేశారు. బహుజన వర్గాలకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరడం లేదని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ కుటుంబం తెలంగాణను దోచుకుంటుందని బీఎస్పీ నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ దుయ్యబట్టారు. ప్రగతిభవన్ మీద నీలి జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దోపిడీ దొరల నుంచి తెలంగాణను కాపాడాలని పిలుపునిచ్చారు. 213 రోజులు తెలంగాణలో పర్యటించానని, అధికార పార్టీ వాళ్లు ఎన్ని అడ్డంకులు పెట్టినా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించానని ప్రవీణ్‌కుమార్ తెలిపారు.