Share News

Sabitha : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణం ఇదేనా?

ABN , First Publish Date - 2023-11-05T15:03:26+05:30 IST

:మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) గన్ మెన్ ఆత్మహత్య పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కుమార్తె కళ్లెదుటే ఇవాళ గన్ మెన్ ఫజల్ అలీ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Sabitha : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య.. కారణం ఇదేనా?

హైదరాబాద్:మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) గన్ మెన్ ఆత్మహత్య పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కుమార్తె కళ్లెదుటే ఇవాళ గన్ మెన్ ఫజల్ అలీ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబితా ఇంద్రారెడ్డి దగ్గర ఫజల్ అలీ అనే గన్ మెన్ కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఇవాళ ఆయన విధులకు వెళ్తూ కుమార్తెను వెంట తీసుకెళ్లారు. అమీర్‌పేట(Ameerpet) శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ వద్దకు రాగానే కుమార్తెతో పర్సనల్ విషయాలు మాట్లాడారు.


ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న గన్ తో తలలో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి(Osmania Hospital) తరలించారు. అయితే అప్పుల బాధతోనే ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫజల్ ఓ ప్రైవేటు బ్యాంకులో అప్పు తీసుకున్నట్లు కుమార్తె తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడానికి బ్యాంకునుంచి అప్పు తీసుకున్నట్లు సమాచారం. కుమార్తెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-11-05T16:05:18+05:30 IST