TS News: ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు
ABN , First Publish Date - 2023-06-15T20:13:54+05:30 IST
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal)పై దేశద్రోహం కేసు పెట్టారు. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ (Tadwai Police Station)లో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal)పై దేశద్రోహం కేసు నమోదయ్యింది. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ (Tadwai Police Station)లో కేసు నమోదయ్యింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. ఇంతకీ ఈ విషయం ఎలా బయటపడిందంటే.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అతడిపై మరిన్ని కేసులు ఉన్నట్లు.. బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలియజేశారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను ప్రస్తావించడంతో బయటపడింది.
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్ (జస్టిస్ సురేశ్ ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరుల పేర్లున్నాయి.
152 మంది నిందితులు
152 మంది ఉద్యమకారులు, మేధావులను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చింది. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో బీరెల్లి గ్రామం వద్ద ఆరోజు తెల్లవారుజామున మావోయిస్టు పార్టీ సభ్యులు కొంతమంది సమావేశామవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. పోలీసులు రావడంతో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. అక్కడ పోలీసులు తనిఖీలు చేసి విప్లవ సాహిత్యాన్ని, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండడంతో వారిని నిందితులుగా చేర్చారు. ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులను హత్య చేయడానికి వీరంతా మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర చేసినట్లు పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్ (జస్టిస్ సురేశ్ ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్ పద్మజాషా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరుల పేర్లున్నాయి.