Telangana High Court: కడుపులో క్లాత్ వదిలేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్
ABN , First Publish Date - 2023-04-20T19:57:51+05:30 IST
గిత్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ (operation) చేసి కడుపులో గుడ్డ మరచిపోయి కుట్లు వేసిన ఘటనను తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) సీరియస్‌గా తీసుకుంది.
హైదరాబాద్: జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ (operation) చేసి కడుపులో గుడ్డ మరచిపోయి కుట్లు వేసిన ఘటనను తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలను కోర్ట్ పరిగణలోకి తీసుకుంది.
కాగా 16 నెలల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్య శ్రీ అనే మహిళకు సర్జరీ ద్వారా ఆసుపత్రి వైద్యులు డెలివరీ చేశారు. అయితే కడుపులోనే బట్టను మరిచి ఆపరేషన్ పూర్తి చేశారు. సంవత్సరం తర్వాత నవ్యశ్రీ కి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచన మేరకు స్కానింగ్ చేయించుకోగా.. కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కలెక్టర్ యాస్మిన్ భాషా కూడా స్పందించారు. వెంటనే నివేదిక ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. నవ్య శ్రీకి సర్జరీ చేసిన వైద్యుల వివరాలపై ఆరా తీశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.