KCR: అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది: కేసీఆర్

ABN , First Publish Date - 2023-06-12T18:56:34+05:30 IST

అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో మొత్తం 94 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయితే.. ఒక్క తెలంగాణలోనే 54 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారని, ఇది గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఒకప్పుడు గద్వాల ప్రాంతం కరువుతో అల్లాడిందని, ఇప్పుడు గద్వాల జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు.

KCR: అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది: కేసీఆర్

గద్వాల: అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. దేశంలో మొత్తం 94 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయితే.. ఒక్క తెలంగాణలోనే 54 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారని, ఇది గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. గద్వాల కలెక్టరేట్‌, బీఆర్‌ఎస్ (BRS) ఆఫీస్‌ను కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు గద్వాల ప్రాంతం కరువుతో అల్లాడిందని, ఇప్పుడు గద్వాల జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. తెలంగాణలో నడిగడ్డ రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమైందన్నారు. ఆర్డీఎస్ పనులు కూడా త్వరితగతిన పూర్తిచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఓ నాడు గంజి కేంద్రాలు ఉన్న పాలమూరు జిల్లా పరిస్దితి నేడు మారిందన్నారు. అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నామని చెప్పారు. పాలమూరు జిల్లాకు మిషన్ భగీరథ ద్వార నిత్యం స్వచ్చమైన నీరు అందిస్తున్నామని గుర్తుచేశారు. ఇతర ప్రాంతాల నుంచి పాలమూరు జిల్లాకే ఉపాధి కోసం వలసవచ్చే రోజులు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-12T18:56:34+05:30 IST