Revanth Reddy: రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-11T21:25:42+05:30 IST

జిల్లాలోని ఇల్లందు కార్నర్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy: రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

భద్రాద్రి: జిల్లాలోని ఇల్లందు కార్నర్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల (BRS Leaders)ను చెట్లకు కట్టేసి పోడు రైతులకు పట్టాలు ఇచ్చేవరకు వదలమన్నారు. పదకొండున్నర లక్షల మంది పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని రేవంత్ డిమాండ్. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉన్న ఎస్టీలకే రిజర్వేషన్లు ఇవ్వలేదని, బోయలు కేసీఅర్ (KCR)ని నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ వసూళ్ల దందాపై కూడా ఆయన మండిపడ్డారు.

ఇదిలావుండగా.. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. కేసీఆర్ పరోక్షంగా మోదీ (PM Modi)కి సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి (Singareni)ని ప్రైవేట్ పరం కానిచ్చే ప్రసక్తే లేదన్నారు. ఆయన ఇవాళ కొత్తగూడెం

(Kottagudem)లో సింగరేణి కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణిని కాపాడేందుకు కాంగ్రెస్ (Congress) చర్యలు

తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటూనే మైన్స్ను ప్రైవేట్ పరం చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. సింగరేణి సమస్యలపై

పార్టీలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - 2023-02-11T21:40:25+05:30 IST