Kishan Reddy: భారత్ ను ఆ దేశాలతో పోల్చడం అలావాటైంది: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-01-18T20:38:38+05:30 IST

9 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Kishan Reddy: భారత్ ను ఆ దేశాలతో పోల్చడం అలావాటైంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: 9 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ సీఎం హోదాలో ఉండి దేశాన్ని అవమానించడం సరికాదన్నారు. భారత్‌ను పాక్‌, చైనాతో పోల్చడం కేసీఆర్‌కు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాజకీయంగా బీజేపీని విమర్శించండి.. దేశాన్ని కాదు’’ అని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ అంతరాత్మ అన్నారు. కొడుకు సీఎం కావాలని కేసీఆర్ అంతరాత్మ కోరుకుంటోందన్నారు.

జల వివాదంలో ఇద్దరు సీఎంలు ఎందుకు కూర్చొని మాట్లాడుకోరు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లడిల్లుతోందన్నారు. కేవలం మోదీని తిట్టేందుకే సభ పెట్టారని ఆగ్రహించారు. సభలో ఏ నాయకుడు BRS గురించి మాట్లాడలేదన్నారు. ఢిల్లీకి పోతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేయడమే లక్ష్యమన్నారు.

Updated Date - 2023-01-18T20:38:39+05:30 IST