మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డిపై ఎంపీ అర్వింద్ ఫైర్
ABN , First Publish Date - 2023-01-23T16:40:53+05:30 IST
మంత్రులు కేటీఆర్ (KTR), ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy)పై ఎంపీ అర్వింద్ (MP Arvind) ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: మంత్రులు కేటీఆర్ (KTR), ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy)పై ఎంపీ అర్వింద్ (MP Arvind) ఫైర్ అయ్యారు. అక్రమ సంపాదనను దాచుకోవడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 9ఏళ్లుగా కేటీఆర్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కమీషన్ల డిమాండ్‌కు భయపడి పసుపు బోర్డు ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. కేసీఆర్ (KCR) కాళ్లు మొక్కి సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులు తెచ్చానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పడం దారుణమన్నారు.