TS News: సర్జికల్ బ్లేడుతో దాడులు
ABN , First Publish Date - 2023-05-10T21:31:26+05:30 IST
జిల్లాలోని చౌడాపూర్ మండలం మల్కాపూర్‌లో భూ తగాదాలు భగ్గుమన్నాయి.
వికారాబాద్: జిల్లాలోని చౌడాపూర్ మండలం మల్కాపూర్‌లో భూ తగాదాలు భగ్గుమన్నాయి. 2.20 ఎకరాల భూమి విషయంలో దయాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సర్జికల్ బ్లేడుతో కొందరిపై దాడి జరిగినట్టు సమాచారం. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సర్వే నంబర్ 99 లోని 2.20 ఎకరాల భూమి విషయంలో గజ్జి మల్లయ్య వారి దయాదుల మధ్య భూవివాదం కొనసాగుతోంది. కోర్టులో పరిధిలో భూవివాదం ఉంది. అయినా... దయాదులు పొలాన్ని దున్నే ప్రయత్నం చేశారు. వారిని మల్లయ్య కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.