KCR: తెలంగాణ నెంబర్ వన్: కేసీఆర్‌

ABN , First Publish Date - 2023-06-09T19:04:05+05:30 IST

తలసారి ఆదాయంలో తెలంగాణ (Telangana) నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రకటించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

KCR: తెలంగాణ నెంబర్ వన్: కేసీఆర్‌

మంచిర్యాల: తలసారి ఆదాయంలో తెలంగాణ (Telangana) నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ (CM KCR) ప్రకటించారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంచిర్యాల (Mancherial) కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చాలా విషయాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొని ప్రగతి సాధించామని గుర్తుచేశారు. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మంచిర్యాల సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. నస్పూర్‌లో 26.24 ఎకరాల కేటాయించగా 2018 ఫిబ్రవరి 27న కేసీఆర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 50.20 కోట్ల వ్యయంతో మంచిర్యాల కలెక్టట్‌ సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తయింది. ఏడాది కాలంలో పూర్తి కావాల్సి ఉండగా రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఇందులో కలెక్టర్‌ బంగ్లాతో పాటు రెండు అడిషనల్‌ కలెక్టర్‌, 8 మంది జిల్లా అధికారుల నివాసాలు ఉన్నాయి. కలెక్టర్‌ బంగ్లా పూర్తయి నివాసం ఉంటుండగా మిగిలిన అధికారుల నివాస గృహాలుపూర్తి కావాల్సి ఉంది. విద్యుత్‌ సరఫరాకు సమీపంలో 11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-06-09T19:04:05+05:30 IST